Saturday, December 21, 2024
Homeఆంధ్రప్రదేశ్పేదల పెన్నిధి వైయస్ జగన్

పేదల పెన్నిధి వైయస్ జగన్

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పేదల పెన్నిధి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ రాష్ట్ర యువనాయకులు ప్రదీప్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని, ప్రతి రైతుకు లబ్ధి చేకూరిందని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. జగన్ పరిపాలన పేదల పక్షాన నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, వైసీపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రవిచంద్రా రెడ్డి, మాజీ ఎంపిపి రఘురామ్, గ్రామ సర్పంచులు చంద్రశేఖర్, ఇస్మాయిల్, నాయకులు శివరామిరెడ్డి, ముక్కరన్న, అర్లప్ప, గాదిరెడ్డి, మూకిరెడ్డి రెడ్డి, హనుమంతు,ఈరన్న, కామయ్య, భీమన్న, మహాదేవ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు