విశాలాంధ్ర ధర్మవరం;; మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మాసపల్లి సాయికుమార్ ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయాలకు సంబంధం లేకుండా విదేశాలలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అమ్మాయిలపై అసభ్యంగా ప్రచారం చేయడం సిగ్గుమాలిన చర్య అని వారు తెలిపారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లాయర్ ఫక్రుద్దీన్, వైయస్సార్సీపి నాయకులు గుర్రం శ్రీనివాసరెడ్డి, చందమూరి నారాయణరెడ్డి, షేక్ చాంద్ బాషా, చౌడప్ప తదితరులు కలరు.
అసభ్యకరమైన పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సిపి నాయకులు
RELATED ARTICLES