విశాలాంధ్ర అనంతపురం అగ్నిమాపక వారోత్సవ కార్యక్రమం లో బాగంగా అనంతపురం నగరంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు శనివారం వైద్య సిబ్బందికి, సెక్యూరిటీ గార్డులకు జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి కె పి లింగమయ్య అగ్నిమాపక నివారణపై అవగాహన కల్పించారు. మొదటిగ అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే పొగ గదుల్లో చిక్కుకున్న వారిని ఏ విధంగా రక్షించవలెను అక్కడ చిక్కుకున్న వ్యక్తులను రెస్క్యూ మెథడ్స్ ద్వారా పైనంతస్తుల నుండి వారిని రక్షించి సహాయ చర్యలను అందించే విధానాన్ని జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి తెలియజేశారు. హాస్పిటల్ సూపస్ఇండెంట్ కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు, ఆర్ ఎం ఓ జి హేమలత, నర్స్ లకు, ప్రజలకు మరియు సెక్యూరిటీ సిబ్బందికి ప్యానిక్ కాకుండా మనసులో అలజడి చెలరేగకుండా ఏ విధంగా పై అంతస్తుల నుండి కిందికి ఎరాక్యులేషన్ ద్వారా తొక్కిసలాటలేకుండా ప్రజలు అప్రమత్తంగా వచ్చే విధంగా ఉండే రెస్యూ మెథడ్స్ ని చేసి తెలియజేశారు. అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే ఈ నంబర్స్ 101, 08554-220299,
9963739592 సంప్రదించాలన్నారు . అనంతరం గోడపత్రికలను, కరపత్రాలు అందజేశారు. ఫైర్ సిబ్బందిని మరియు సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి ని అగ్నిమాపక నివారణ పై అవగాహన కల్పించినందుకు జి జి హెచ్ వైద్యాధికారులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ ఎఫ్ లు
ఎస్. రమేష్ కుమార్ రెడ్డి , బి. వెంకటేసులు , కె . కృష్ణ కుమార్ , ఈ.ఈరేష్ గౌడ్ డి ఓ పి, సి. ఎఫ్ ఎం లు మధుసూదన వై. ఓబీ రెడ్డి, ఏ. వంశీ కృష్ణ , బి. వేణుగోపాల్, జి. తిప్పే స్వామి , కే.జయరాముడు , కే. అనిల్ కుమార్, బి. సుధాకర్ , ఏం. రమేష్ , డి. శివ తేజ హెచ్ సి, ఆసుపత్రి సిబ్బంది సెక్యూరిటీ గార్డులు తదితరులు పాల్గొన్నారు.
అగ్నిమాపక నివారణ పై అవగాహన
RELATED ARTICLES