Homeఅమరావతికి చట్టబద్ధత

అమరావతికి చట్టబద్ధత

- Advertisement -

లోక్‌సభలో బిల్లు ఆమోదం

మద్దతు పలికిన కాంగ్రెస్
చర్చలో పాల్గొన్న 18 మంది ఎంపీలు
వ్యతిరేకం కాదంటూనే వాకౌట్ చేసిన వైసీపీ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం- 2014లోని సెక్షన్ 5(2)కి సవరణ చేస్తూ కేంద్ర హోం శాఖ రూపొందించిన బిల్లును ఆ శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సుమారు రెండు గంటలపాటు దీనిపై సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లుపై చర్చలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వైసీపీ, సమాజ్‌వాదీ పార్టీతో సహా మొత్తం పలు పార్టీల ఎంపీలు చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. అయితే చర్చలో పాల్గొన్న వైసీపీ ఎంపీలు అమరావతికి తాము వ్యతిరేకం కాదంటూనే బిల్లు లోపభూయిష్టంగా ఉందని ఆరోపిస్తూ వాకౌట్ చేశారు.
అమరావతి రాజధాని అభివృద్ధి చెందాలి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీతత్వంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. అమరావతికి చట్టబద్దత బిల్లుకు లోక్‌సభలో ఆయన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకపోవడం దురదృష్టకరమన్నారు. అమరావతి రాజధానిగా ఎంతో అభివద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
అమరావతి ఇక శాశ్వత రాజధాని : కేంద్ర మంత్రి పెమ్మసాని
ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుందా అన్న అనుమానానికి ఈ చట్టసవరణ ముగింపు పలుకుతుందని బిల్లుపై చర్చలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అమరావతికి చట్టబద్ధత ఇచ్చేందుకు అంగీకరించిన ప్రధాని మోదీకి, అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి అనేది చంద్రబాబు ఆశయం, కల, ధ్యేయమని పెమ్మసాని పేర్కొన్నారు. కూటమి ఐక్యతకు కంకణబద్ధుడైన వ్యక్తి పవన్‌కల్యాణ్ అని కొనియాడారు. జగన్ అణచివేత వల్లే అమరావతి ఒక ఉద్యమంగా మారి దేశాన్ని ఆకర్షించిందని పెమ్మసాని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో రాజధాని కీలక పాత్ర పోషిస్తుందని, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఆయా రాష్ట్రాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. అమరావతి ఏపీ ఆర్థిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమరావతికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు : మాణికం ఠాగూర్అ మరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పార్లమెంటులో చర్చ

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు