విశాలాంధ్ర/హైదరాబాద్: మహారాష్ట్ర ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం కింద స్థాపించిన నయంత విశ్వవిద్యాలయం 2025 ఆగస్టు నెలలో తరగతులను ప్రారంభించనుంది. ‘న్యూ హోప్’ అని అర్థం వచ్చే ‘నయంత’ అనే పేరుతో ప్రారంభిస్తున్న ఈ విశ్వవిద్యాలయం భారతదేశానికి భవిష్యత్ నాయకులను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా రాజ్ దుగర్, భరత్ పూరి, నౌషాద్ ఫోర్బ్స్, క్రిస్ గోపాలకృష్ణన్, నాదిర్ గోద్రేజ్, మెహర్ పుదుంజీ, సతీష్ రెడ్డి వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తల మద్దతుతో నయంత వర్సిటీ కార్యకలాపాలు సాగించడం ఉంది. పూణేలోని బవ్ధాన్‌లో తాత్కాలిక క్యాంపస్ వేదికగా ‘నయంత’… పరివర్తనాత్మక విద్యా (ట్రాన్స్‌ఫర్మేషన్ ఎడ్యుకేషన్) విధానంతో పూర్తి రెసిడెన్షియల్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను అందించే విశ్వవిద్యాలయం. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయం శాశ్వత క్యాంపస్ పూణేలో అభివృద్ధి దశలో ఉంది.