Tuesday, February 4, 2025
Homeవిశ్లేషణఆప్‌, బీజేపీ మధ్య సైద్ధాంతిక పోరాటం!

ఆప్‌, బీజేపీ మధ్య సైద్ధాంతిక పోరాటం!

బీ.కె. కాంగో

ఇటీవల ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ తమకు, బీజేపీకి మధ్య సైద్ధాంతిక పోరాటం ఉందని అన్నారు. పోరాటం జరుగుతుందని చెప్పారేగానీ, అది ఎలా జరుగుతుందో, ఏమిటో చెప్పలేదు. పన్నుల ద్వారా వచ్చే డబ్బును తాము, బీజేపీ ఎలా ఖర్చు చేస్తాయో తెలిపారు. ఆప్‌ సామాన్య ప్రజలకు ఖర్చు చేస్తుందని, బీజేపీ సంపన్నులకు ఖర్చు చేస్తుందని తెలిపారు. అయితే అసలు సమస్యను చెప్పడంలో కేజ్రీవాల్‌ విఫలమయ్యారు.
ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత భగవత్‌ 2023లో స్వాతంత్య్రాన్ని పొందామని అన్నారు. రామమందిరం నిర్మించినప్పుడే స్వాతంత్య్రం పొందారట. వాస్తవమైన సైద్ధాంతిక పోరాటం జాతీయతావాదం (స్వాతంత్య్ర పోరాటం)పై బీజేపీ చేపట్టలేదు. బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్‌ ఒక దశలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా పదవిని చేపట్టిన 2014లోనే వాస్తవమైన స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఇలా బీజేపీ నాయకులు ఎవరికి ఇష్టంవచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. స్వాతంత్య్ర పోరాటమే ఎరుగని వీరు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నట్లు అబద్ధాలాడటంలో పైచేయి సాధించారు. ఇండియా అనే భావన సమ్మిళిత జాతీయవాదం. పురోగామిశక్తులు నిర్వచించినట్లుగా ఇండియా బ్రిటీష్‌ పాలకులతో మహత్తరపోరాటం జరిపిన అనంతరం 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్రాన్ని సాధించింది. బ్రిటీష్‌ వారు తాము అనుసరించే విభజించు పాలించు విధానంతో ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభలను ప్రోత్సహించారు. అంతిమంగా స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో దేశాన్ని పాకిస్థాన్‌, ఇండియాగా విభజించారు. పాకిస్థాన్‌ ముస్లిం దేశంగా ఏర్పడిరది.
భారతదేశ ప్రజలు స్వాతంత్య్ర పోరాటం జరిపి బానిస సంకెళ్లనుంచి విముక్తిని సాధించారు. అయితే ఏ మతం, కులం, రంగు, భాషను స్వాతంత్య్రానికి నిర్వచనంగా తీసుకోలేదు. అందువల్లనే ఇండియా రాజ్యాంగం, ఈ దేశం మతం, కులం, రంగు, వర్గంతో నిమిత్తం లేకుండా ప్రజలందరిదీ అని ప్రకటించింది. ఏ ఒక్క నాయకుడు లేదా పార్టీ మూలంగా స్వాతంత్య్రం పొందలేదు. దేశప్రజలు పురోగామిశక్తులు, నాయకులు జరిపిన పోరాటమే స్వాతంత్య్రం సిద్ధించడానికి కారణం. స్వాతంత్య్ర పోరాటాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌, హిందు మహాసభ, ముస్లిం లీగ్‌ వ్యతిరేకించాయి. విభజన అనంతరం వీరు స్వల్ప సంఖ్యాకులే అయ్యారు. స్వాతంత్య్రానికి మహాత్మాగాంధీ నడుంకట్టి పోరాడారు. ఈ నేపథ్యంలో ఆయనను హత్యగావించేందుకు ప్రణాళిక రూపొందించు కున్నారు. హిందు ఛాందసవాదుల్లో ఒకరైన నాధూరామ్‌ గాడ్సే గాంధీ మహాత్ముడిని హతమార్చాడు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆ సంస్థ నియమించిన దుండగులు మహాత్ముడిని పొట్టనబెట్టు కున్నారు. మితవాదశక్తులు ఇండియాపై పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం నూతనతరం స్వేచ్చా భారత దేశంలో జన్మించారు. వీరు స్వాతంత్య్ర పోరాటాన్ని ఏమాత్రం ఎరుగరు. తమకు గుర్తింపు కావాలని కోరుకునే రాజకీయాల కాలంలో ఈ తరం పెరిగింది. భయం, ద్వేషం, తప్పుడు అభిప్రాయాలు, ఛాందసవాద పునరుద్ధరణను లేదా మితవాద శక్తులకు మద్దతుతెలిపే పెట్టుబడీదారీ విధానం సంక్షోభంలో ఉంది. ఈ పరిస్థితిని చాలా చాకచక్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌, మితవాదశక్తులు కలిసి దేశ అధికారాన్ని చేజిక్కించుకున్నాయి.
అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత వారు అనుసరించిన ఇదే విధానాలను అనుసరించకుండా నిరోధించడానికి రాజ్యాంగాన్ని, దాని విలువలను దిగజార్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అన్ని ప్రభుత్వ సంస్థలలో జోక్యం చేసుకునేందుకు, మీడియాను లోబరుచుకునేందుకు ప్రజాస్వామ్యం గొంతు నులిమేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించి చాలావరకు సాధించారు. పైగా ప్రతిపక్షాలను జాతీయ వ్యతిరేకులుగా తూలనాడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపి విమర్శించడాన్ని జాతి వ్యతిరేకులుగా పరిగణిస్తు న్నారు. ప్రగతిశీల, మానవీయ, ప్రజాస్వామ్య శక్తులను అర్బన్‌ నక్సల్స్‌ అని ఆరోపణలు చేస్తున్నారు. పెట్టుబడీదారీ, ఉన్నతవర్గాలను ప్రాచీన ఉన్నత వర్గాలను, కులాలను, మత గ్రూపులను రక్షించేందుకు దేశతిరోగమన యంత్రాంగాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ నేపథó్యంలో ‘‘బీజేపీని ఓడిరచండి, రాజ్యాంగాన్ని కాపాడండి’’ అన్న నినాదం ప్రముఖంగా ప్రజలలో విస్తరించింది. అయితే పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా ‘‘అబ్‌కి బార్‌ చార్‌ సౌ పార్‌’’ బీజేపీ నినాదంగా మరింత ముందుకు వచ్చింది. బీజేపీ ఏనాడూ 400 సీట్లను గెలుచుకోలేదు. గెలుచుకోవడం కూడా సాధ్యం కాకపోవచ్చు. 400 సీట్లు గెలుచుకుని రాజ్యాంగాన్ని మార్పు చేస్తామని కర్నాటక బీజేపీ నాయకుడు అనంతకుమార్‌ హెగ్డే స్పష్టంగా చెప్పారు. అంతిమంగా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లను కూడా గెలవలేకపోయారు. ఫలితంగా బీజేపీ ఆటలు సాగలేదు. తమ నినాదం విఫలమైనందున ఇప్పుడు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని, రాజ్యాంగ ప్రధాన నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ను ప్రశంసిస్తున్నామని చెబుతున్నారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ చేసిన ప్రకటన ఆర్‌ఎస్‌ఎస్‌ అసలు స్వరూపాన్ని బైటపెట్టింది. కేంద్ర హోం శాఖమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యానాలు అంబేద్కర్‌ను అవమానించాయి. వాస్తవమైన జాతీయవాదం కోసం నిజంగానే సైద్ధాంతిక పోరాటం మొదలైంది. ఇండియా, స్వాతంత్య్ర పోరాటం కలిసి పురోగమన జాతీయవాదం. మతం, కులం, రంగు, భాషతో నిమిత్తంలేని సామాన్య భారతీయులు తాము ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకున్నప్పుడు గొప్ప దేశంగా ఆవిర్భవిస్తుంది. స్వాతంత్య్రం సిద్ధించిన సమయం అర్థరాత్రి మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ తన ప్రసంగంలో ‘‘భవిష్యత్తుతో సమాగమం’’ అని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ దానికి సంబంధించిన సంస్థ ఈ ప్రసంగాన్ని వ్యతిరేకించాయి. మహాత్మాగాంధీని హత్యగావించిన తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌పైన నిషేధం విధించారు. అయితే నిషేధాన్ని తొలగింపచేసుకునేందుకు తాము రాజ్యాంగాన్ని గౌరవిస్తామని ఒక హామీ పత్రాన్ని రాసిచ్చారు. అయితే ఏ రోజూ దాన్ని పాటించలేదు. రాజ్యాంగ విలువలను గౌరవించలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాలపైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేదు. ఇప్పుడు దేశ అధికారాన్ని సాధించుకున్న తర్వాత మత అజెండాతో తమ ప్రణాళికల అమలుకు పూనుకున్నారు. ఛాందసవాదులు వారికి సహాయపడుతున్నారు. ప్రపంచ రంగంపై మితవాదశక్తులు ఇప్పుడు ప్రముఖంగా పనిచేస్తు న్నాయి. వీటిని అర్థంచేసుకునేందుకు తర్కవాదం అవసరం. పెట్టుబడీదారీ వ్యవస్థ సంక్షోభ ప్రభావం, ఛాందసవాద శక్తులు ఐకమత్య, రాజ్యాంగ వ్యతిరేకత నేడు ప్రధానంగా కనిపిస్తున్నాయి. సోవియట్‌ యూనియన్‌లో సోషలిస్టు సమాజం అంతరించిన తరువాత ఆ దేశంలో అనేక రాష్ట్రాలు కూడా విడిపోయాయి. ఆ రాష్ట్రాలు స్వతంత్రంగా వ్యవహరిస్తూ సోషలిస్టు విధానాలను అనుసరించకపోవడంతో తిరోగామిశక్తులు అధికారాన్ని చేపట్టడానికి వీలుకలిగింది. ప్రజాస్వామ్య వ్యతిరేక అణచివేత రాజ్యాధికారం, మితవాద, ఛాందసవాద శక్తులు అత్యంత తీవ్రంగా పనిచేస్తున్నాయి. ఇవి ప్రజావ్యతిరేకంగా ఉన్నాయి. ప్రజలను గందరగోళపరచేందుకు అతివాద జాతీయతను, మతోన్మాదాన్ని అనుసరిస్తున్నాయి. 20వ శతాబ్దిలో పెట్టుబడిదారీ అణచివేత శక్తులకు 21వ శతాబ్దంలో ఆధిపత్యం చెలాయించే తిరోగామి శక్తులకు మధ్య తేడా ఉంది. దీన్ని ఫాసిస్టుశక్తిగా భావించవచ్చు. ఫాసిస్టుశక్తుల పోకడలను ఓడిరచేందుకుగాను ప్రజాస్వామ్య, సెక్యులర్‌, సోషలిస్టు ఇండియా రాజ్యాంగ కీలక విలువలు, విశాల ఐక్యత ఏర్పడేందుకు సహాయపడవలసి ఉంటుంది.

వాస్తవమైన జాతీయవాదం కోసం నిజంగానే సైద్ధాంతిక పోరాటం మొదలైంది. ఇండియా, స్వాతంత్య్ర పోరాటం కలిసి పురోగమన జాతీయవాదం. మతం, కులం, రంగు, భాషతో నిమిత్తంలేని సామాన్య భారతీయులు తాము ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకున్నప్పుడు గొప్ప దేశంగా ఆవిర్భవిస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు