Homeసినిమాఈ సినిమాలో హీరో నేను కాదు: సూర్య

ఈ సినిమాలో హీరో నేను కాదు: సూర్య

- Advertisement -

మదురై: సూర్య హీరోగా ఆర్జే బాలాజీ తెరకెక్కించిన సినిమా ‘కరుప్ప్పు’. తెలుగులో ‘వీరభద్రుడు’. త్రిష హీరోయిన్. మే 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మదురైలో ఈ మూవీ ఆడియో విడుదల వేడుక ఘనంగా జరిగింది. హీరో సూర్య మాట్లాడుతూ అభిమానులు 28 ఏళ్లుగా తనకు మద్దతిస్తున్నారని, వారి ప్రేమ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని ధన్యవాదాలు చెప్పారు. మదురై తనకెంతో ప్రత్యేకమని, ఇక్కడ లభించే ఆహారం ఇష్టమన్నారు. ‘కరుప్ప్పు’ గురించి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో హీరో నేను కాదు. కరుప్పస్వామి హీరో. మనపై మనకు నమ్మకం ఉంటే… అద్భుతాలు తప్పక జరుగుతాయి. ఆర్జే బాలాజీ క్రియేటివ్ డైరెక్టర్. ఈ చిత్రం విషయంలో టెక్నికల్ టీమ్ కీలకం. స్టంట్స్, సంగీతం సినిమాలో హైలైట్. ‘కరుప్ప్పు’ ఫస్టాఫ్ ఎమోషనల్‌గా, సెకండాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. మా పని నిజాయతీగా పూర్తి చేశాం. ఫలితం మీ చేతుల్లోనే ఉంది. మే 14న థియేటర్లలో కలుద్దాం’ అని పేర్కొన్నారు. దర్శకుడు ఆర్జే బాలాజీ ‘కరుప్ప్పు’ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ‘సూర్య సార్‌ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించే ప్రయత్నం చేశా. 45 నిమిషాల పాటు కథ విని నటించేందుకు వెంటనే అంగీకరించారు. సాధారణంగా స్టార్ నటుల చిత్రాల్లో… హీరోలకు ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. కానీ, ‘కరుప్ప్పు’లో హీరో లేని సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఈ విషయంలోనూ సూర్య నో చెప్పలేదు’ అని కొనియాడారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు