Saturday, February 22, 2025
Homeఅంతర్జాతీయంఉక్రెయిన్‌లో యుద్ధం ఆపాలి

ఉక్రెయిన్‌లో యుద్ధం ఆపాలి

నాటో నుంచి బ్రిటన్‌ నిష్క్రమించాలి: బ్రిటిష్‌ కమ్యూనిస్టు పార్టీ డిమాండ్‌

లండన్‌: ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని తక్షణమే ఆపాలని, నాటో నుంచి బ్రిటన్‌ బయటకు రావాలని బ్రిటిష్‌ కమ్యూనిస్టు పార్టీ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేసింది. ఉక్రెయిన్‌లో శాంతి దీర్ఘకాలంగా పెండిరగ్‌ ఉందని… యుద్ధాన్ని ఆపి, శాంతి నెలకొల్పేందుకు ఇదే సమయమని పేర్కొంది. రష్యా, అమెరికా చర్చల క్రమంలో ఈ ప్రకటన చేసింది. రియాద్‌ సదస్సుకు తమను దూరంగా ఉంచినట్లు బ్రిటిష్‌, ఈయూ నేతల ఫిర్యాదు సమంజనం కాదని అభిప్రాయపడిరది. రెండేళ్లపాటు యుద్ధాన్ని ప్రోత్సహించిన మీరు… ఇప్పుడు శాంతి చర్చల్లో మమ్మల్ని భాగస్వాములు చేయలేదని అనడం రెండు నాల్కెల ధోరణికి నిదర్శనమని అని బ్రిటిష్‌ కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ కార్యదర్శి కెవన్‌ నెల్సన్‌ దుయ్యబట్టారు. నాటో నుంచి ఉక్రెయిన్‌ను దూరం పెట్టేలా ఒప్పందం జరిగితే రష్యా పశ్చిమ సరిహద్దుల దిశగా 20ఏళ్ల నాటో, ఈయూ మార్చ్‌ ఆగిపోవచ్చన్నారు. శాంతి రక్షకులుగా ఉక్రెయిన్‌లో బ్రిటిష్‌ బలగాలను కైర్‌ స్టార్మర్‌ మోహరించడాన్ని ఖండిరచారు. కొన్నేళ్లుగా బ్రిటిష్‌ దళాలు శాంతి, ప్రజాస్వామ్యం, పాశ్చాత్య విలువల పేరిట అఫ్ఘనిస్థాన్‌, సెర్బియా, కసోవో, ఇరాక్‌, లిబియా, యెమన్‌, సిరియాపై బాంబులు కురిపిస్తున్నాయని నెల్సన్‌ గుర్తుచేశారు. గాజాలోని నిరాయుధ పలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ దండయాత్రకు సంపూర్ణ మద్దతిచ్చాయని దుయ్యబట్టారు. నాటో నుంచి బ్రిటన్‌ బయటకు రావాలన్నది తమ దీర్ఘకాలిక డిమాండ్‌గా బ్రిటిష్‌ కమ్యూనిస్టులు తెలిపారు. లేబర్‌ ప్రభుత్వం ప్రతిపాదన మేరకు జీడీపీలో నుంచి 2.5శాతాన్ని బ్రిటిష్‌ సైన్యం కోసం ఖర్చు చేయడాన్ని సీపీ పొలిటికల్‌ కమిటీ వ్యతిరేకించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఐదు శాతాన్ని డిమాండ్‌ చేయడాన్ని ఆక్షేపించింది.
ఉక్రెయిన్‌లోని సహజ వనరుల దోపిడీకి అమెరికా, రష్యా యత్నిస్తున్నట్లు హెచ్చరించింది. ఉక్రెయిన్‌ కమ్యూనిస్టు పార్టీపై నిషేధాన్ని ఎత్తివేయాలని, కార్మిక సంఘాలను, దేశంలో ప్రజాస్వామిక హక్కులను పునరుద్ధరించాలని అధ్యక్షుడు జెలెన్‌స్కీకి సీపీ పొలిటికల్‌ కమిటీ పిలుపునిచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు