ప్రజాభిóప్రాయాల సేకరణకు పోర్టల్
ప్లానింగ్ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభు త్వం ప్రతిపాదించిన పీ
4 విధానాన్ని ఉగాది పండుగ నుంచి ప్రారంభిం చనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడిరచారు. సచివాలయంలో ప్లానింగ్ శాఖపై సమీక్ష సందర్భంగా పీ4 కార్యక్రమం ప్రారంభంపై అధికారులతో చర్చించారు. ఈ విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10 శాతం మంది… అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. దీనిపై సమగ్ర విధి విధానాలను రూపొందించేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తీసుకునేందుకు ప్రత్యేకంగా పోర్టల్‌ను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలతో పాటు ఉన్నత స్థాయిలో ఉన్న వారు చాలా మంది పేదలకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారని, వీరందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చి పీ4 విధానం అమలు చేస్తామని చెప్పారు. ఇదే సమయంలో ప్రత్యేక సర్వే ద్వారా అట్టడుగు వర్గాలను గుర్తించి వారికి సాయం అందేలా చేస్తామన్నారు. దీనికోసం అవసరమైన డేటాను సేకరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అనేకమంది పారిశ్రామిక వేత్తలు తమ సొంత గ్రామాలు, మండలాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చారని, అలా ఆసక్తి ఉన్న వారిని స్వయంగా ఆహ్వానించి, ఉగాది రోజున పీ
4 కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తామన్నారు. పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్-పార్టనర్‌్‌షిప్ విధానం అమలు ద్వారా పేదరిక నిర్మూలనకు అడుగులు వేస్తామని సీఎం అన్నారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్లానింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.