Homeఆంధ్రప్రదేశ్ఉత్తర కోస్తా, రాయలసీమలోభారీ వర్షాలు

ఉత్తర కోస్తా, రాయలసీమలోభారీ వర్షాలు

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఉత్తర కోస్తా, రాయలసీమకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతోపాటు నిన్నటి నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవనుంది. ఉత్తరకోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. గురువారం పోలవరం, తిరువూరు, అనకాపల్లిలో 5 సెంటీమీటర్ల చొప్పున, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, చింతలపూడి, పెద్దాపురం, మాచర్లలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడిరచింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు