గ్రీస్‌వ్యాప్తంగా కార్యక్రమాలు: వేలాది మంది హాజరు
ఏథెన్స్: అమెరికా మద్దతిచ్చిన జుంటాపై 1973లో జరిగిన పాలిటెక్నిక్ విప్లవం 51వ వార్షికోత్సవాన్ని గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడున్న అమెరికా దౌత్యకార్యాలయం వరకు కదం తొక్కారు. గ్రీస్ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఏథెన్స్‌లో గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) అధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలస్తీనా ప్రజలకు సంఫీుభావం ప్రకటించారు. గాజాలో మారణహోమాన్ని ఆపాలని… ఆ ప్రణాళికల్లో గ్రీస్ జోక్యం చేసుకోరాదని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేకేఈ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దిమిత్రిస్ కౌట్సోంబస్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘51ఏళ్ల తర్వాత కూడా మనం పోరాడుతున్నాం… భవిష్యత్‌లోనూ పోరాడతాం’ అని అందులో పేర్కొన్నారు. ‘పాలిటెక్నిక్ విప్లవమప్పుడు రొట్టె, విద్య, స్వేచ్ఛ కోసం నినాదాలిస్తే… గ్రీస్ నుంచి అమెరికా, నాటో వెళ్లిపోవాలని ఇప్పుడు నినదిస్తున్నాం. గ్రీస్ వర్కర్లు, యువత రోజువారీ సమస్యలు, వేతనాల పెంపు కోసం ప్రస్తుతం గళం వినిపిస్తున్నాం. అధిక ధరలు, సమ్మిళిత కార్మిక ఒప్పందాలను వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ హింస, అణచివేత ధోరణి, దుష్ప్రరిపాలనను ఎండగడుతున్నాం. ప్రభుత్వ విద్య వ్యతిరేక విధానంపై పోరాడుతున్నాం. ప్రజలు, కార్మికులకు వ్యతిరేకమైన చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికాయరోపియన్ యూనియన్
నాటో కూటమికి వ్యతిరేకంగా, పలస్తీనా స్వేచ్ఛ కోసం పోరాటాలు సాగిస్తున్నాం. 50ఏళ్లకుపైగా పోరాడుతున్నాం… భవిష్యత్‌లోనూ పోరాటాలు కొనసాగిస్తాం’ అని ప్రకటన పేర్కొంది.