Homeఆంధ్రప్రదేశ్ఏపీఎల్‌ విజేత భీమవరం బుల్స్‌

ఏపీఎల్‌ విజేత భీమవరం బుల్స్‌

- Advertisement -
  • ఫైనల్‌లో చేతులెత్తేసిన వైజాగ్‌ బ్యాటర్లు
  • భీమవరం బుల్స్‌ అద్భుత విజయం

ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ విజేతగా భీమవరం బుల్స్‌ నిలిచింది. మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్‌ మైదానంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఫైనల్‌ మ్యాచలో సింహాద్రి వైజాగ్‌ లయన్సపై భీమవరం బుల్స్‌ జట్టు పది వికెట్ల తేడాతో రికార్డు విజయం నమోదు చేయడంతోపాటు ఏపీఎల్‌ కప్పును సొంతం చేసుకుంది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వైజాగ్‌ లయన్స జట్టు ఆదిలోనే తడబడింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు తక్కువ స్కోర్లకే పెవిలియన దారి పట్టడంతో కష్టాల్లో చిక్కుకుంది. మిడిల్‌ ఆర్డర్‌లో త్రిపురణ విజయ్‌ 25 బంతుల్లో 39 (నాటౌట్‌), బోధల వినయ్‌కుమార్‌ 14 బంతుల్లో 19 పరుగులు సాధించడంతో వైజాగ్‌ లయన్స జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భీమవరం బుల్స్‌ బ్యాటర్లు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా చెలరేగిపోయారు. ఏసీఏ స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించారు. కేవలం 9 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 140 పరుగులు చేసి ఫైనల్‌లో వైజాగ్‌ లయన్సపై రికార్డు విజయం నమోదు చేసింది. భీమవరం బుల్స్‌ బ్యాటర్లు కెప్టెన ఎం.హేమంత రెడ్డి 23 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు, రేవంత రెడ్డి 33 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్సర్లతో 71 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు ఊహించని విజయాన్ని అందించారు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా రవి తేజ ఎంపికయ్యాడు.
గెలుపొందిన భీమవరం జట్టుకు మంత్రి లోకేష్ 35 లక్షల ప్రైజ్ మనీ చెక్ తో పాటు ట్రోఫీ ని అందించారు రన్నెర్స్ కి 20 లక్షల చెక్ ని అందించారు ఈ కార్యక్రమం లో ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాధ్(చిన్ని),సెక్రటరీ సాన సతీష్, ఎంపీ భరత్, ఏ సి ఏ వైస్ ప్రెసిడెంట్ బండారు నరసింహారావు, ట్రెజరర్ దండమూడి శ్రీనివాస్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు