ముంబయి: బ్యాటరీలు, విద్యుదీకరణలో సహకార పరిశోధన వ్యవస్థను స్థాపించడానికి హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీల)తో భాగస్వామ్యమైంది. ఐఐటీ విశ్వవిద్యాలయాలతో కలిసి బ్యాటరీ, విద్యుదీకరణ-సంబంధిత పరిశోధనలను సంయుక్తంగా నిర్వహించడానికి 2025 నుండి ప్రారంభమయ్యే ఐదు సంవత్సరాలలో సుమారు 7 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని గ్రూప్ యోచిస్తోంది. కొరియా, భారతదేశం నుండి బ్యాటరీ, విద్యుదీకరణ నిపుణుల మధ్య సాంకేతిక, మానవ మార్పిడిని సులభతరం చేయడానికి, ప్రతిభను పెంపొందించడానికి, దీర్ఘకాలిక ఉపాధిని ప్రోత్సహించడానికి హ్యుందాయ్ సీఓఈ ఈ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ మూడు ఇన్‌స్టిట్యూట్‌లలో ఐఐటీ ఢల్లీి, ఐఐటీ బాంబే మరియు ఐఐటీ మద్రాస్ ఉన్నాయి. ఐఐటీ ఢల్లీిలో ఏర్పాటు చేయనున్న హ్యుందాయ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, హ్యుందాయ్ మోటార్ గ్రూప్ నుండి స్పాన్సర్‌షిప్‌ల ద్వారా జరుగుతుంది.