ముంబయి: ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, దాని సలహాదారుల కోసం ప్రత్యేకంగా అందించే మొబైల్ యాప్, ఐప్రు ఎడ్జ్, హెచ్1-ఎఫ్‌వై2025లో వారి ఉత్పాదకతలో 37% పెరుగుదలకు దారితీసింది. ఫలితంగా వారికి అధిక ఆదాయమూ వచ్చింది. ముఖ్యంగా, ఐప్రు ఎడ్జ్‌ని ఉపయోగించే 98.1% ఏజెంట్లకు అదే రోజు కమీషన్‌లు చెల్లించబడ్డాయి. ఎంపిక చేయబడిన డిస్ట్రిబ్యూటర్‌లకు అదే రోజున కమీషన్‌లను చెల్లించే మొదటి జీవిత బీమా సంస్థ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్. కంపెనీ 2 లక్షలకు పైగా సలహాదారుల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. కంపెనీ అగ్ర సలహాదారులలో దాదాపు 61% మంది ఇప్పుడు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడంలో సహాయపడే యాప్‌ను చురుకుగా ఉపయోగిస్తున్నారు. ఈ మొబైల్ యాప్ ఏజెంట్ల కోసం ప్రయాణంలో సైతం కార్యాలయంగా పనిచేస్తుంది.