విశాలాంధ్ర/హైదరాబాద్ః ఒప్పో ఇండియా కొత్తగా విడుదల చేసిన ఎఫ్29 సిరీస్ అద్భుతంగా విజయంతమైనట్లు ప్రకటించింది. దీనికి అద్భుతమైన మార్కెట్ స్పందన లభించింది. హైదరాబాద్‌లో జరిగిన మొదటి 21 రోజుల విక్రయాల అవధిలో, ఒప్పో ఎఫ్29 సిరీస్ ఒప్పో ఎఫ్27 ప్రోం కన్నా 28% అమ్మకాల వృద్ధిని సాధించింది. ఇది ఈ ప్రాంతంలో దానికి పెరుగుతున్న ప్రజాదరణను, దృఢమైన డిమాండ్‌ను తెలియజేస్తోంది. ఒప్పో ఎఫ్29 సిరీస్‌ను భారతదేశం కోసం, కఠినమైన సవాళ్లను అధిగమించేలా తయారు చేశారు. పెరుగుతున్న గిగ్ ఎకానమీని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. డ్రైవర్లు, డెలివరీ భాగస్వాములు, హోం-సర్వీస్ నిపుణులు, చిన్న వ్యాపార యజమానులకు ఇది తోడుగా ఉంటుంది. మిలిటరీ-గ్రేడ్ దృఢత్వం, అధునాతన కనెక్టివిటీ, దీర్ఘకాలిక బ్యాటరీ శక్తిని కలిపి, ఎఫ్29 సిరీస్ సన్నని, స్టైలిష్ డిజైన్‌లో ఏదైనా సవాలును స్వీకరించేలా తయారు చేశారు.