- Advertisement -
న్యూఢిల్లీ: భారతదేశం యుద్ధాన్ని కోరుకో దని.. దేశ భద్రత విషయంలో రాజీ పడదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జాతీయ మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు బడ్జెట్‌తో పాటు స్వదేశీ రక్షణ ఉత్పత్తిని పెం చుతున్నామన్నారు. రక్షణ బడ్జెట్‌ను రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.7.5 లక్షల కోట్లకు పెంచినట్లు తెలిపారు. రక్షణ పరికరాలు, ఆయుధాల తయారీకి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. దేశీయంగా డిజైన్, అభివృద్ధి, తయారీ సామర్థ్యాలను పెంచుతున్నట్లు వెల్లడించారు.


