Monday, February 24, 2025
Homeవ్యాపారంకొత్త ‘హాఫ్‌టైమ్‌’ ప్రచారాన్ని ప్రారంభించి కోకా-కోలా

కొత్త ‘హాఫ్‌టైమ్‌’ ప్రచారాన్ని ప్రారంభించి కోకా-కోలా

న్యూదిల్లీ: కోకాకోలా కొత్త గేమ్‌-ఛేంజింగ్‌ ప్రచారం ‘హాఫ్‌టైమ్‌’ను ప్రారంభిస్తోంది. ఇది జీవితంలోని చిన్న పాజ్‌లను గమనించేందుకు, రీసెట్‌ అయ్యేందుకు, కొత్త ఉత్సాహంతో తిరిగి ప్రారంభించేందుకు అభిమానులను ప్రేరేపిస్తుంది. క్రీడలలో హాఫ్‌టైమ్‌ ఇచ్చే ఎనర్జీ, వ్యూహం, పునరుద్ధరణ భావనల ఆధారంగా రూపొందిన ఈ ప్రచారం, ఒక సాధారణ పాజ్‌ను అర్ధవంతమైన అనుభవంగా మారుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించిన, హాఫ్‌టైమ్‌ ప్రచారం స్టోరీ టెల్లింగ్‌, బ్రాండ్‌ సినిమాలు, డిజిటల్‌ అనుభవాల వినూత్న సమ్మేళనంతో, ఒక సాధారణ విరామం కొత్త దృక్పథాన్ని ఎలా తెస్తుందో చూపిస్తుంది. ఇందులో భారతదేశం ముందంజలో ఉంది, ఇక్కడ మొదటి చిత్రం కోకాకోలా సిప్‌ ఆ క్షణాలను ప్రత్యేకమైనవిగా ఎలా మారుస్తుందో హైలైట్‌ చేస్తుంది. త్వరిత రీఛార్జ్‌ కోసం మ్యాచ్‌ మధ్యలో తక్షణ రీఛార్జ్‌ కోసం విరామం తీసుకునే ఆటగాళ్లనుంచి, జీవితంలో ముందుకు సాగడానికి హాఫ్‌ టైమ్‌ అవసరమనే సందేశాన్ని ఈ ప్రచారం మనకు గుర్తు చేస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు