ట్రంప్‌కు హమాస్ స్పష్టీకరణ
కైరో : ఇజ్రాయిలీ ఖైదీల విడుదలకు కాల్పుల విరమణ ఒక్కటే మార్గమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుర్తు పెట్టుకోవాలని హమాస్ తేల్చిచెప్పింది. ఇజ్రాయిల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ జరిగినప్పుడే ఇజ్రాయిలీ ఖైదీలు వారి ఇళ్లకు చేరుకోగలుగుతారని హమాస్ సీనియర్ అధికారి సమీ అబు జుహ్రీ మంగళవారం రాయిటర్స్‌కు తెలిపారు. ‘రెండు వర్గాల మధ్య జరిగిన ఒప్పందాన్ని గౌరవించాలని ట్రంప్ గమనంలో ఉంచుకోవాలి. ఖైదీలు తమ ఇళ్లకు చేరుకోవాలంటే అందుకు కాల్పుల విమరణ ఏకైక మార్గమని మరువరాదు. బెదిరింపులకు పాల్పడితే పరిస్థితి మరింత జఠిలమవుతుందే తప్ప సమస్య పరిష్కారం కాదని ఆయన గ్రహించాలి’ అని జుహ్రీ అన్నారు. శనివారంలోగా ఇజ్రాయిలీ ఖైదీలను విడుదల చేయకపోతే కాల్పుల విరమణ రద్దు అవుతుందని, విధ్వంసకర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని ట్రంప్ సోమవారం హమాస్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలో హమాస్ నేత పై విధంగా స్పందించారు. బెదిరింపులను పట్టించుకునేది లేదని స్పష్టంచేశారు. హెచ్చరికలను లెక్కచేయమని తేల్చిచెప్పారు. ఇదిలావుంటే ట్రంప్… కింగ్ అబ్దుల్లాలో మంగళవారం భేటీ అయ్యారు. పలస్తీనియన్లకు పునరావాసాన్ని నిరాకరించిన అరబ్ దేశానికి సాయం ఆపేస్తామంటూ ఆయన ఇప్పటికే బెదిరంచారు. గాజా పునరాభివృవృద్ధి యోచన నేపథ్యంలో కింగ్ అబ్దుల్లాతో ట్రంప్ అబ్దుల్లా సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడిరది.
ఖైదీల విడుదలకు కాల్పుల విరమణే మార్గం
RELATED ARTICLES