Homeగనుల ఆదాయ లక్ష్యంరూ.4,650 కోట్లు

గనుల ఆదాయ లక్ష్యంరూ.4,650 కోట్లు

- Advertisement -

. రూ.1.90 లక్షల కోట్ల పెట్టుబడులు… 1.52 లక్షల మందికి ఉపాధి
. ఇనుప ఖన్పుిం సద్వినియోగానికి కార్యాచరణ
. సీఎం చంద్రబాబు ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్రంలోని ఇనుప ఖనిజ నిల్వలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని అటు ఆదాయం, ఇటు ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. గనుల శాఖపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ సలహాదారు సతీష్ రెడ్డి, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా, ఏపీఎండీసీ వైస్ చైర్మన్, ఎండీ ప్రవీణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సుమారు 1,938 మిలియన్ టన్నుల వరకు ఇనుప ఖనిజం నిల్వలు ఉండటంతో అధిక ఆదాయం పొందేందుకు అవకాశం ఉందని సీఎం అన్నారు. ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ ఇండియా సంస్థ 17.8 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తుండగా… రాయలసీమలో జేఎస్‌డబ్ల్యు సంస్థ కూడా భారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుందన్నారు. 2035 నాటికి వీటి సామర్ధ్యం ఏడాదికి 20 మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం పెంచే దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలోని మొత్తం 17 ఇనుప ఖనిజం బ్లాకులకుగాను… ఇప్పటికే కేటాయించినవి మినహా మిగిలిన బ్లాకులను వివిధ సంస్థలకు కేటాయించాలని సీఎం ఆదేశించారు. 2030 నాటికి ఏడాదికి 30 మెట్రిక్ టన్నులు, 2035 నాటికి ఏడాదికి 113 మె.ట. ఇనుప ఖనిజం ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయాలన్నారు. రానున్న రోజుల్లో ఇనుప ఖనిజం వినియోగం 4 రెట్లు పెరిగే అవకాశం ఉందని, రాష్ట్రాన్ని స్టీల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఇది అద్భుత అవకాశమని చెప్పారు. ఈ రంగంలో రూ.1.90 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.52 లక్షల ఉద్యోగాలు సృష్టి జరుగుతుందని సీఎం అన్నారు. తక్కువ గ్రేడ్ మాగ్నటైట్ ఖనిజాన్ని ప్రాసెస్ చేయడానికి ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని నిర్దేశించారు. ఖనిజాల అన్వేషణ వేగంగా చేపట్టడంతో పాటు లీజుల అనుమతులు త్వరితగతిన మంజూరు చేసేలా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.
2025-26లో లక్ష్యాన్ని మించి గనుల శాఖలో 108 శాతం ఆదాయాన్ని ఆర్జించినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు