Thursday, May 15, 2025
Homeఅంతర్జాతీయంగాజాలో ఆగని రక్తపాతం

గాజాలో ఆగని రక్తపాతం

. ఇళ్లు, ఆసుపత్రులపై ఇజ్రాయిల్‌ బాంబు దాడులు
. 103 మంది దుర్మరణం: మృతుల్లో పిల్లలే అధికం

జెరూసలేం: ఇజ్రాయిల్‌ గాజాలో రక్తపాతాన్ని ఆపడంలేదు. 19 నెలలుగా బాంబుల దాడులు కొనసాగిస్తోంది. నక్బా 77వ వార్షికోత్సవం వేళ అక్కడ విపత్తుకర పరిస్థితులను అక్కడ నెలకొల్పింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు దక్షిణ గాజా నగరం ఖాన్‌ యూనిస్‌పై భీకర దాడులను ఇజ్రాయిల్‌ దళాలు జరిపాయి. 103 మంది పలస్తీనియన్ల ప్రాణాలు తీసింది. చనిపోయిన వారిలో పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఇళ్లు, శిబిరాలు, ఆసుపత్రులపై నిరంతర దాడులు జరిగినట్లు ఆరోగ్య అధికారులు వెల్లడిరచారు. మృతుల్లో చిన్నారులే అధికమని నాసర్‌ మెడికల్‌ కాంపెక్స్‌ వైద్య సిబ్బంది తెలిపారు. ఉత్తర గాజాలోని జబాలియా, అల్‌-నహ్దా శిబిరాలు, ఆసుపత్రులపై దాడులు జరిగాయి. హెచ్చరికలు లేకుండా ఖాన్‌ యూనిస్‌లో తొమ్మిది ఇళ్లను లక్ష్యంగా చేసుకొని వాటిపై యుద్ధ విమానాలతో బాంబులు కురిపించాయి. ఆ ఇళ్లలోని కుటుంబాలనూ తుడిచిపెట్టాయి. అల్‌-నహ్దాలో జరిగిన దాడుల్లో ఫుట్‌బాల్‌ ఆడుకుంటున్న పిల్లలు మరణించారు. ఖాన్‌ యునిస్‌లోని యూరోపియన్‌ హాస్పిటల్‌, నాసర్‌ హాస్పిటల్‌పై బాంబు దాడి జరిగింది. నాసర్‌ ఆసుపత్రిలో ఒక జర్నలిస్ట్‌ సహా ఇద్దరు చనిపోయారు. బుధవారం దాడుల్లో 30 మందికిపైగా పిల్లలు మృతిచెందారు. పలస్తీనియన్లను తుడిపెట్టేందుకు ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఊచకోతను వేగవంతం చేస్తున్నారని హమాస్‌ మండిపడిరది. ఇదిలావుంటే, గాజా ప్రజలను పస్తులు ఉంచి ఇజ్రాయిల్‌ చంపేస్తోందని ఐక్యరాజ్య సమితి (ఐరాస) తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేసింది. యుఎన్‌ మానవ హక్కుల సమన్వయకర్త టామ్‌ ఫ్లెచర్‌ స్పందిస్తూ పది వారాలకుపైగా గాజాకి నిత్యావసరాల సరఫరాను ఇజ్రాయిల్‌ నిలిపివేసిందని అన్నారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే భావితరాలకు ఏం సమాధానం చెబుతామంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత భద్రతా మండలితో కలిసి పనిచేసే ప్రతి ఒక్కరిపై ఉందని నొక్కిచెప్పారు. ప్రపంచ ఆహార కార్యక్రమం గాజా డైరెక్టర్‌ ఆంథోనీ రెనార్డ్‌ స్పందిస్తూ ఒకప్పుడు రోజుకు పది లక్షల మందికి భోజనం పెట్టే కమ్యూనిటీ కిచెన్‌లు ప్రస్తుతం రెండు లక్షల మందికీ ఆహారం ఇవ్వలేకపోతున్నాయన్నారు. నిత్యావసరాల కొరతతో చాలా కిచెన్‌లు మూతబడే పరిస్థితి ఏర్పడిరదన్నారు. ఇప్పటికే కొన్ని స్వచ్చంధ సంస్థల కిచెన్‌లు మూతపడ్డాయన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు