ఎన్టీఆర్ జాతీయ పురస్కారంపై చిరంజీవి
హైదరాబాద్: ఎన్టీఆర్ అంటే కళల సమ్మేళనమని, అలాంటి మహానుభావుడి పేరుతో ఉన్న ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ తనకు దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తు న్నానని ప్రముఖ నటుడు చిరంజీవి పేర్కొన్నారు. తెలుగు సినిమా కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహనీయుడు అంటూ ఎన్టీఆర్‌ను కొనియాడారు. ‘దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపో యినా… కొన్ని పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభ ఆయనది. రామా రావు జన్మించిందే సినిమాల కోసం అన్నట్టుగా… ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిది’ అని అన్నారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా లో పోస్టు పెట్టారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఎన్టీఆర్ జాతీయ పుర స్కారాన్ని చిరంజీవి అందుకున్నారు. ఈ అవార్డుల వేడుకలో పాల్గొన్న రామ్‌చరణ్ కూడా తాజాగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఎన్టీఆర్ జాతీ య పురస్కారంతో తన తండ్రిని సత్కరించడం తమ కుటుంబానికి అత్యంత గర్వకారణమైన, భావోద్వేగ క్షణమని అన్నారు. ఈ అవార్డు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. సినిమాపై ఆయనకున్న ప్రేమ, పనిపై ఉన్న నిబద్ధత స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ప్రతిభను గుర్తించి, ఘనంగా అవార్డుల వేడుకను నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
గొప్ప గౌరవంగా భావిస్తున్నా…
- Advertisement -


