Thursday, March 6, 2025
Home‘చండీగఢ్‌ చలో’కు విఘాతం

‘చండీగఢ్‌ చలో’కు విఘాతం

రైతులను ఎక్కడికక్కడ ఆపేసిన పోలీసులు

వందల మంది అరెస్టు – రోడ్లపైనే భైఠాయించి నిరసన తెలిపిన అన్నదాతలు

చండీగఢ్‌ : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపు మేరకు ‘చండీగఢ్‌ చలో’ను పంజాబ్‌ రౖౖెతులు బుధవారం చేపట్టారు. చండీగఢ్‌కు కదం తొక్కారు. దీంతో రాజధాని నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులను భారీగా మోహరించారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. రైతులను చండీగఢ్‌కు వెళ్లనివ్వకుండా పోలీసులు వారిని ఎక్కడికక్కడే ఆపేశారు. వందల మందిని నిర్బంధించారు. దీంతో పంజాబ్‌లోని 25కుపైగా స్థానాల్లో రైతుల ధర్నాలు జరిగాయి. అరెస్టైన వారిలో బీకేయూ ఉగ్రాహన్‌ అధ్యక్షుడు జోగిందర్‌ సింగ్‌ ఉగ్రహన్‌, బీకేయూ రాజేవాల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముకేశ్‌ చంద్ర శర్మ, బీకేయూ షాదిపూర్‌ అధ్యక్షుడు బూటా సింగ్‌ షాదిపూర్‌ తదితరులు ఉన్నారు. ఉగ్రహాన్‌, ఆయన మద్దతుదారులను పోలీసులు సంగ్రూర్‌లోని ఛజిలి పోలీసు స్టేషన్‌కు తరలించారు. సంగ్రూర్‌, మాన్సా, బర్నాలా, భటిండా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు రోడ్లపైనే బైఠాయించారు. ధర్నాలు చేశారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితి… వందల మంది అరెస్టుల వేళ మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. సీఎం భగవత్‌ మాన్‌ ఉత్తర్వులను ధిక్కరించారు. తమను చండీగఢ్‌కు వెళ్లనివ్వకపోవడంతో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ట్రాక్టర్‌`ట్రాలీలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో చండీగఢ్‌కు బయల్దేరిన రైతులను పంజాబ్‌ పోలీసులు ఎక్కడికక్కడే నిలువరించారు. కాంత్రికారీ కిసాన్‌ యూనియన్‌ మొగా జిల్లా అధ్యక్షుడు జతిందర్‌ సింగ్‌ను అజిత్వాల్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సంరాలా, పాటియాలాలోనూ రైతులను ఆపేశారు. చెక్‌ పాయింట్‌ వద్ద 100 మంది పోలీసులను మోహరించి, చండీగఢ్‌ వైపునకు వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయిస్తున్నట్లు సీనియర్‌ పోలీసు అధికారి వెల్లడిరచారు. చండీగఢ్‌మొహాలీ సరిహద్దు పాయింట్ల వద్ద బారికేడ్లను చండీగఢ్‌ పోలీసులు ఏర్పాటు చేశారు. ఘర్షణల నివారణకు యాంటీరయట్‌ వాహనాలను సిద్ధం చేశారు. అలాగే అంబులెన్సులు, అగ్నిమాపక శకటాలను అందుబాటులో ఉంచినట్లు ఓ అధికారి వెల్లడిరచారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు