Monday, February 24, 2025
Homeఅంతర్జాతీయంచరిత్ర మార్చే యత్నాలు ఆక్షేపణీయం

చరిత్ర మార్చే యత్నాలు ఆక్షేపణీయం

ఇటలీ కమ్యూనిస్టు ఫ్రంట్‌

రోమ్‌: చరిత్ర మార్చే ప్రయత్నాలు ఆక్షేపణీయమని ఇటలీ కమ్యూనిస్ట్‌ ఫ్రంట్‌ పేర్కొంది. సామ్రాజ్యవాదులు, వలసవాదులు, నియంతల ప్రయోజనాల దృష్ట్యా జరిగే సంస్కరణలను… చారిత్రక సంస్కరణలను, స్కూళ్లు, రాజకీయ చర్యలు, ప్రజా వ్యవస్థలను శాశ్వతంగా నియంత్రించాలనుకునే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చింది. ఫిబ్రవరి 10న పాటించే ‘స్మారక దినం’ (రిమెంబరెన్స్‌ డే) సందర్భంగా ఇటలీ కమ్యూనిస్ట్‌ ఫ్రంట్‌ (ఫ్రాంటే కమ్యూనిస్టా) ఈ మేరకు ప్రకటన చేసింది. ‘ఫోయిబే మారణహోమం’ పేరిట దేశ, కమ్యూనిస్టుల వ్యతిరేక ప్రచారాన్ని ఆక్షేపించింది. ఇస్ట్రియా, ఫ్యుమే, దాల్మెషియా ప్రాంతాల నుంచి ఇటలీ ప్రజల వలసల నేపథ్యంలో ఇటలీ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. జాతీయ, కమ్యూనిస్టు వ్యతిరేకతతో దేశ సిద్ధాంతాల స్థాయిలో ఫాసిస్టు ప్రచారానికి స్మారక దినం పాటిస్తారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు