Homeఅంతర్జాతీయంచైనా, భారత్‌తోనే పశ్చిమాసియాకు పరిష్కారం

చైనా, భారత్‌తోనే పశ్చిమాసియాకు పరిష్కారం

- Advertisement -

హిల్లరీ క్లింటన్
న్యూయార్క్: పశ్చిమాసియా సమస్య పరిష్కారానికి భారత్, చైనా కీలకమని అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దౌత్య పరమైన పరిష్కారంలో ఈ రెండు దేశాలు కీలక పాత్ర పోషించగలవని ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిల్లరీ అన్నారు. ‘ట్రంప్ ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడగలరన్నది తేలాలంటే చైనా, భారత్ కీలక పాత్ర పోషించాలి. ఇరాన్ నుంచి చమురు, గ్యాస్ అధికంగా కొనుగోలు చేస్తున్న దేశాలు ఇవే. ట్యాంకర్ల ద్వారా పొందిన శిలాజ ఇంధనాలను చైనా పెద్ద మొత్తంలో నిల్వ చేస్తున్నది కాబట్టి ఆ దేశానికి ఇరాన్ అవసరం. ట్రంప్ నిజంగా దౌత్యనీతిని పాటించడానికి సిద్ధమైతే అత్యధిక ఒత్తిడి చైనా నుంచే వస్తుందనిపిస్తోంది’ అని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు