Homeఅంతర్జాతీయం‘జెరాల్డ్ ఆర్ ఫోర్్డ‌’ వెనక్కి

‘జెరాల్డ్ ఆర్ ఫోర్్డ‌’ వెనక్కి

- Advertisement -

వాషింగ్టన్: అమెరికాకు చెందిన శక్తిమంతమైన విమాన వాహక నౌక ‘జెరాల్డ్ ఆర్ ఫోర్డ’ యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగింది. మరమ్మతులు అవసరం కావడంతో గ్రీస్‌లోని నాటో స్థావరమైన క్రెటెకు బయల్దేరింది. ఈ నౌక లాండ్రీలో 12వ తేదీన భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. ఇద్దరు సైలర్లు గాయపడ్డారు. దీంతో ఎర్ర సముద్రం మీదుగా క్రెటెలోని సౌద బేకు ఈ నౌక ప్రయాణిస్తోంది. ఈ నౌకకు అత్యవసర మరమ్మతులు అక్కడ చేస్తారు. క్యారియర్ స్ట్రైక్ గ్రూపులోని మిగిలిన నౌకలు ఇప్పటికీ యుద్ధ క్షేత్రంలోనే ఉన్నాయి. జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ మరమ్మతుల కోసం వెళుతున్నట్లు యూఎసఎనఐ న్యూస్ వెల్లడించినా…పెంటగాన్ స్పందించలేదు. పరిస్థితి తీవ్రతను తగ్గించి చూపిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. అగ్ని ప్రమాదంలో 600 మంది సిబ్బంది పడకలు దగ్ధమయ్యాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.30 గంటలు మంటలు కొనసాగినట్లు వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు