Sunday, February 23, 2025
Homeదిల్లీ కొత్త సీఎం రేఖాగుప్తా

దిల్లీ కొత్త సీఎం రేఖాగుప్తా

నేడు ప్రమాణ స్వీకారం…
భారీ ఏర్పాట్లు

న్యూదిల్లీ : దిల్లీ నూతన సీఎంగా రేఖ గుప్తాను ఎంపిక చేస్తూ బీజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆమెను పార్టీ శాసనసభాపక్ష నేతగా దిల్లీలో జరిగిన భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం మధ్యాహ్నం ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటీవల జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలు బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అధిష్ఠాన పరిశీలకులుగా వి.శంకర్‌ ప్రసాద్‌, ఓం ప్రకాశ్‌ ధన్కర్‌ హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం రేఖా గుప్తా పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా అంగీకరించారు. ఈ విషయాన్ని అధిష్ఠానానికి తెలిపారు. నూతన ముఖ్యమంత్రికి పార్టీ అధిష్ఠానం శుభాకాంక్షలు తెలిపింది. కాగా ఫిబ్రవరి 20న (గురువారం) మధ్యాహ్నం 12:45 గంటలకు దిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు బీజేపీ వర్గాలు వెల్లడిరచాయి. రేఖాగుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయను న్నారు. రామ్‌లీలా మైదాన్‌లో జరిగే ఈ వేడుకకు కాషాయ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రమాణ స్వీకారానికి ముందు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షా, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాతో పాటు 50 మంది సినీతారలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు ఇతర దేశాల దౌత్యవేత్తలు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కేంద్రమం త్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి ఆప్‌ అధినేత, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆతిశీ, కాంగ్రెస్‌ దిల్లీ అధ్యక్షుడు దేవేందర్‌ యాదవ్‌లు సైతం ఆహ్వానితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 8న వెలువడిన దిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు అవుతున్నా నూతన ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పటిదాకా నిర్ణయించలేదు. దిల్లీ కొత్త సీఎంగా రేఖను ప్రకటించే ముందు మాజీ సీఎం సాహిబ్‌ సింగ్‌ వర్మ కుమారుడు పర్వేశ్‌ వర్మ పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపించింది. ఆయన తాజా ఎన్నికల్లో కేజ్రీవాల్‌పై విజయం సాధించారు.
రేఖాగుప్తా ఎవరు?
రేఖ గుప్తా దిల్లీ షాలిమార్‌ బాగ్‌ అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం దిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. 50 ఏళ్ల రేఖ 1974లో హర్యానాలోని జింద్‌ జిల్లా నంద్‌గఢ్‌ గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో అధికారి. రేఖ కుటుంబం 1976లో దిల్లీకి మారింది. అప్పటికి ఆమెకు రెండేళ్ల వయసు. దీని తరువాత, రేఖ ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య దిల్లీలో జరిగింది. తన బాల్యంలోనే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ)లో చేరారు. దిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు, ఆమె దౌలత్‌ రామ్‌ కళాశాలలో కార్యదర్శి ఎన్నికల్లో విజయం సాధించారు. 199596లో, ఆమె దిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. రేఖ ఎల్‌ఎల్‌బి చేశారు. చదువు పూర్తయిన తర్వాత 2003-04లో బీజేపీ యువ మోర్చా దిల్లీ యూనిట్‌లో చేరి కార్యదర్శి పదవిని చేపట్టారు. 2004 నుండి 2006 వరకు ఆమె భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. 2007లో ఉత్తర పితంపుర నుండి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2007-09దిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి కమిటీకి రెండు సంవత్సరాలు చైర్‌పర్సన్‌గా ఉన్నారు. 2009: దిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2010: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె షాలిమార్‌ బాగ్‌ స్థానం నుండి పోటీ చేశారు. 2015లో ఆమె ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన వందన కుమారి చేతిలో దాదాపు 11 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2020లో దాదాపు 3,400 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె వందన కుమారిని భారీ తేడాతో ఓడిరచారు. ఇటీవల జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో విజయం మోగించి, 27 ఏళ్ల తర్వాత తిరిగి అధికారం చేజిక్కించుకుంది. 2020లో 62 స్థానాల్లో గెలుపొందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ, 40సీట్లు కోల్పోయి 22కే పరిమితమైంది. కాంగ్రెస్‌ ఖాతా తెరవలేకపో యింది. ఆప్‌ అగ్రనేతలు అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోదియా లాంటి నేతలు ఓటమి పాలయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు