హెడ్మాస్టర్ ఉమాపతి
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్ష ఫలితాలలో విద్యార్థులు ప్రతిభను చాటడం జరిగిందని హెడ్మాస్టర్ ఉమాపతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో టాప్ రిజల్ట్గా మా పాఠశాల నిలవడం పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 80 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు ఏ పాఠశాలలో కూడా ఇంతటి ఫలితాలు రాలేదని వారు స్పష్టం చేశారు. మొత్తం మా పాఠశాల నుండి 189 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 150 యొక్క మంది ఉత్తీర్ణులు కావడం జరిగిందని, తద్వారా 80 శాతము నమోదు కావడం జరిగిందన్నారు. 500 మార్కులు పైగా 55 మంది విద్యార్థులు సంపాదించడం జరిగిందని తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులలో పి. జ్ఞాపిక 586 మార్కులు, డి. అక్షయ 585 మార్కులు, పి. లక్ష్మి 582 మార్కులు, డి. కీర్తన 582 మార్కులు, కె. వైష్ణ సహస్ర 575 మార్కులు, పి. మధుమిత్రా 575 మార్కులు రావడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ తో పాటు ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.