హైదరాబాద్: ఫోన్ (3ఏ) సిరీస్ స్నాప్‌డ్రాగన్ చిప్సెట్చే సమృద్ధమై, చక్కని పనితీరుకు కచ్చితమైన జోడీగా ఉండబోతుందని లండన్ఆధారిత టెక్నాలజీ కంపెనీ నథింగ్ ప్రకటించింది. నథింగ్ సీఈఓ కార్ల్ పేయ్
ఫోన్ (3ఏ)తో తాము క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ సిరీస్‌కు తిరిగి వెళుతున్నామని ప్రకటించడానికి తాను చాలా సంతోషిస్తున్నామని తెలిపింది. ఫోన్ (2ఏ) ప్లస్‌తో పోలిస్తే ఇది 25 శాతం వేగవంతమైన సీపీయూ, 72 శాతం వేగవంతమైన ఎన్‌పీయూను కలిగి ఉండబోతుందన్నారు. ఫోన్ (3ఏ) సిరీస్ భారత కాలమానం ప్రకారం మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది. రాబోయే ఆవిష్కరణ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫ్లిప్‌కార్ట్‌పై సన్`అప్ చేయవచ్చన్నారు.