Wednesday, December 4, 2024
Homeబియ్యం అక్రమాలపై సీఐడీ దర్యాప్తు

బియ్యం అక్రమాలపై సీఐడీ దర్యాప్తు

. ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం కీలక పాలసీలు
. జలజీవన్‌ మిషన్‌ పున:ప్రారంభం
. 15న పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం
. పర్యాటక అభివృద్ధికి టూరిజం సర్క్యూట్స్‌
. తిరుపతి, వైజాగ్‌, విజయవాడ, అమరావతిలో వర్కింగ్‌ సెంటర్లు
. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: కాకినాడ పోర్టు కేంద్రంగా పెద్దఎత్తున సాగుతున్న పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాపై సీఐడీతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ అంశాన్ని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమావేశంలో ప్రస్తావించారు. తన దృష్టికి వచ్చిన అక్రమాలను వెల్లడిరచారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ సీఐడీచే విచారణ జరిపించి బియ్యం మాఫియాను అరికడదామని హామీ ఇచ్చారు. ‘కాకినాడ పోర్టును, కాకినాడ సెజ్‌ను బలవంతంగా లాక్కున్నారు. పోర్టు లాగేసుకుని 41 శాతం కేవీ రావుకు ఇచ్చేసి 59 శాతం అరబిందోకు అప్పగించారు. ఆస్తులు గుంజుకోవడం రాష్ట్రంలో కొత్త ధోరణి అయింది. ఇంతకుముందు మనం ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలను బాగా ధ్వంసం చేశారు. వీటన్నింటిపై సీఐడీ విచారణ జరిపిద్దామని మంత్రులతో చంద్రబాబు అన్నారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై మంత్రులతో సీఎం చర్చించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్ధసారథి మీడియాకు వివరించారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికిగాను కొన్ని పాలసీలకు మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సమావేశంలో మంత్రి నారాయణ, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. అ ఆంధ్రప్రదేశ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ (జీసీసీ) పాలసీ (4.0) 2024-2029కు ఆమోదం అ రాష్ట్రాన్ని నాలెడ్జ్‌ ఎకానమీకి గ్లోబల్‌ హబ్‌గా మార్చే లక్ష్యంతో ఐటీ, జీసీసీ పాలసీ 4.0 (2024-2029)కు ఆమోదం అ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు ప్రపంచ వ్యాపార రంగంలో కీలకంగా మారాయి. సాంకేతిక వ్యాపార పరిభాషలో వీటిని గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) అంటారు. కొన్ని కీలక విధుల నిర్వహణకు బహుళజాతి సంస్థలు (ఎంఎన్‌సీలు) విదేశాల్లో ఏర్పాటు చేసే కేంద్రాలివి. రిమోట్‌ వర్క్‌, హైబ్రిడ్‌ వర్క్‌, కో-వర్కింగ్‌ స్పేస్‌ వంటి అత్యాధునిక సర్వీస్‌ డెలివరీ మోడళ్లను ఏర్పాటు చేయడం ఈ పాలసీ లక్ష్యమని మంత్రి తెలిపారు. నూతన ఆవిష్కరణలు, గిగ్‌ ఎకానమీ, వ్యవస్థాపకత, స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున సాంకేతిక ఆధారిత విద్యార్థులను, ప్రతిభావంతులైన వర్కు ఫోర్స్‌ను, సహాయక ప్రభుత్వ విధానాలతో సహా ఆంధ్రప్రదేశ్‌ వ్యూహాత్మక ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి ఈ విధానం దోహదపడుతుందన్నారు. అ స్వర్ణాంధ్ర విజన్‌2047లో భాగంగా రాష్ట్రం ప్రతిష్టాత్మకమైన ‘ఒకే కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకోసం ప్రణాళిక అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
. మౌలిక సదుపాయాలను సత్వరమే సృష్టించడానికి ప్రభుత్వం కో-వర్కింగ్‌ స్పేస్‌లు, పొరుగు వర్కు స్పేస్‌లను పెద్దఎత్తున ప్రోత్సహించాలని భావిస్తున్నది. ఇందుకు ప్రోత్సాహకాలను పెద్దఎత్తున అందజేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది.
. కో-వర్కింగ్‌ స్పేస్‌ అంటే ఒక సెంటర్‌ను ఏర్పాటు చేసి… అక్కడే ఐటీ కంపెనీ, షాపింగ్‌ కాంప్లెక్సు, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏర్పాటు చేయడం
అ తిరుపతి, వైజాగ్‌, విజయవాడ, అమరావతి తదితర పెద్ద కేంద్రాల్లో పొరుగు వర్కింగ్‌ స్పేస్‌ సెంటర్ల ఏర్పాటు, వీటికి అనుబంధంగా గ్రామాల్లో, మండలాల్లో కో-వర్కింగ్‌ స్పేస్‌ సెంటర్ల ఏర్పాటు
అ కనీసం 100 సీట్ల నుండి 10 వేల చదరపు అడుగులతో కో-వర్కింగ్‌ స్పేస్‌ సెంటర్లు అభివృద్ది పర్చే వారికి పెట్టుబడిలో 50 శాతం రాయితీ
అ వంద మందికి వర్కింగ్‌ స్పేస్‌ ఏర్పాటు చేస్తే రూ.2.00 ఆరు మాసాలకు ప్రోత్సాహకంగా ఇవ్వడం
అ ప్రతి సీటుకు రూ.1,000 చొప్పున ఆరు మాసాల్లో ప్రోత్సాహకం అందజేత
అ 5 లక్షల చదరపు అడుగుల ఫ్లోర్‌ ఏరియా పైబడిన ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు చేసేవారికి పెట్టుబడిలో 50 శాతం రాయితీ
అ ‘‘ఆంధ్రప్రదేశ్‌ టెక్స్‌టైల్‌, అపెరల్‌ అండ్‌ గార్మెంట్స్‌ పాలసీ 4.0, 2024-29 ఆమోదం. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి లక్ష్యం
అ 2024 2029 కాలంలో రాష్ట్రం నుంచి వస్త్ర ఎగుమతుల్ని బిలియన్‌ డాలర్లకు పెంచాలని లక్ష్యం
అ ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో (పీపీపీ) 5 కొత్త సమగ్ర టెక్స్‌టైల్‌ పార్కుల అభివృద్ధి
అ ఈ పార్కులను మూడు కేటగిరీలుగా విభజించి ఎంఎస్‌ఎంఈలకు 30 శాతం, మధ్య తరహా పార్కులకు 20 శాతం పెట్టుబడి రాయితీ
అ ఆంధ్రప్రదేశ్‌ మారిటైమ్‌ పాలసీ 4.0 (2024-29)కు ఆమోదం, 975 కిలో మీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచస్థాయి సముద్ర తీర రాష్ట్రంగా అభివృద్ది పర్చాలనే లక్ష్యంగా ఈ పాలసీ రూపొందించామని, ఈ విషయంలో గుజరాత్‌ ప్రథమ, ద్వితీయ స్థానంలో ఏపీ ఉందని మంత్రి తెలిపారు.
అ రాష్ట్రంలో ఒక మెగా షిప్‌యార్డు ఏర్పాటుకు కృషి
అ గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖకు చెందిన 24 మాసాల కాంట్రాక్టు పీరియడ్‌ గల కొన్ని తాగునీటి సరఫరా ప్రాజెక్టుల ధరల సర్దుబాటు
అ జలవనరుల శాఖ ప్రతిపాదనల మేరకు శ్రీకాకు ళం జిల్లా ఉద్దానం, వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం, కర్నూలు జిల్లా డోన్‌
అ ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన – గ్రామీణ ప్రధాన్‌ మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ పథకాలకు ప్రస్తుత యూనిట్‌ విలువ, పద్ధతితో కొనసాగించడానికి, పెండిరగ్‌లో ఉన్న గృహాలు పూర్తి చేయాలని నిర్ణయం
అ అర్బన్‌లో 6.41 లక్షల ఇళ్లు, గ్రామాల్లో 1.09 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని నిర్ణయం
అ ఆంధ్రప్రదేశ్‌ క్రీడల పాలసీ 2024-29 సవరణల ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం
అ పర్యాటక రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు రాబట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ క్రీడల పాలసీ 2024-29కి ఆమోదం
అ ఆంధ్రప్రదేశ్‌ టూరిజం పాలసీ 2024-2029 సమగ్ర వెర్షన్‌ ఆమోదం
అ ఆంధ్రప్రదేశ్‌ సస్టైనబుల్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ పాలసీ 4.0 (2024-29)కి ఆమోదం
అ రాజధాని అమరావతిని ఎలక్ట్రిక్‌ మొబిలిటీ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ సస్టైనబుల్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ పాలసీకి ఆమోదం
అ రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ 4.0 అమలు కోసం, ఆర్‌ఈఎఫ్‌ఎస్‌ ఫ్లోటింగ్‌కు అనుమతించేందుకు చేసిన ప్రతిపాదనకు ఆమోదం
అ ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 15న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని ‘ఆత్మర్పణ దినోత్సవం’గా పాటించాలని నిర్ణయం
అ జల్‌ జీవన్‌ మిషన్‌ పున:ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించగా, రాజధాని నిర్మాణ పనులపై సీఆర్‌డీఏ సమావేశం సోమవారం తీసుకున్న నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు