Saturday, May 17, 2025
Homeవ్యాపారంబీమా రంగంలో అడుగు పెట్టిన అపోలో 24/7

బీమా రంగంలో అడుగు పెట్టిన అపోలో 24/7

హైదరాబాద్‌: నాణ్యమైన ఆరోగ్య సేవలు మరింత మందికి అందించాలన్న లక్ష్యంతో బీమా రంగంలో అడుగు పెట్టామని అపోలో హెల్త్‌కో సీఈఓ మాధివనన్‌ బాలకృష్ణన్‌ తెలిపారు. ఈ మేరకు బంజారా హిల్స్‌ లో ఉన్న తాజ్‌ కృష్ణలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అపోలో హెల్త్‌కోకు చెందిన అపోలో 24ప7 ఇప్పుడు ఇన్సూరెన్స్‌ రంగంలో కూడా సేవలు అందించనుందని చెప్పారు. త్వరలోనే హెల్త్‌, లైఫ్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు అందుబాటులోకి రానున్నాయన్నారు. అపోలో హెల్త్‌కో వినియోగదారుల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన ఇన్సూరెన్స్‌ ప్లాన్లు అందించడమే అపోలో 24ప7 లక్ష్యమన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు