విమానాలకు దారులు మూసివేత
పాక్ నిర్ణయం
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాక్‌కు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న నిర్ణయాలపై పాక్ స్పందించింది. భారత్‌తోనూ అన్ని వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌కు చెందిన అన్ని విమానయాన సంస్థలకు చెందిన విమానాలకు పాక్ గగనతలాన్ని తక్షణం మూసివేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రధాన కార్యాలయం ప్రెస్‌నోట్ విడుదల చేసిందని జాతీయ మీడియా పేర్కొంది. ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసంలో ఆ దేశ త్రివిధ దళాల అధిపతులు, ఇతర ప్రభుత్వ అధికారులతో నేషనల్ సెక్యూటీ కమిటీ(ఎన్ఎస్సీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్థాన్ గుండా లేదా ఇతర దేశాల నుంచి వెళ్లే వస్తువులతో సహా భారతదేశంతో అన్ని రకాల వాణిజ్యాన్ని నిలిపివేసింది. కాగా వాఘా బోర్డర్‌ను మూసివేస్తున్నట్లు పాక్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ప్రాంతీయ భద్రతా, జాతీయ భద్రతా పర్యావరణం గురించి పేర్కొన్నది. 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. దీంతో వాఘా బోర్డర్‌ను మూసివేశారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారతదేశ నిర్ణయాన్ని సమావేశం తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిపింది.
సింధూ జలాల్లో ప్రతి చుక్కా మాదే!
సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే. దీనిపై పాక్ స్పందించింది… భారత్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని పాక్ మంత్రి అవాయిస్ లెఘారీ పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిగా ఉన్న ఈ ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదొలిగే అవకాశం లేదని…ఈ చర్యతో నీటి యుద్ధానికి తెరలేస్తుందని తలిపారు. ‘సింధూ జలాల్లో ప్రతి నీటి చుక్కా మాదే..! ఈ హక్కును మేం చట్టపరంగా, రాజకీయంగా, అంతర్జాతీయంగా పూర్తిశక్తితో కాపాడుకుంటాం’’అని లెఘారీ ఓ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఈ పరిణామాలపై చట్టపరంగా ముందుకెళ్లే అంశాలను పాక్ పరిశీలించినట్లు సమాచారం. అయితే ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్నైనా రద్దుచేసుకునే హక్కు భారత్‌కు ఉంటుంది. అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన వియన్నా ఒప్పందంపై భారత్ సంతకం చేయలేదు కాబట్టి పాక్ ఏ కోర్టుకు వెళ్లినా, అంతర్జాతీయ సంస్థకు వెళ్లినా వారు ఎటువంటి తీర్పు ఇచ్చినా భారత్‌కు వర్తించదు. 1960ల్లో భారత్, పాక్ మధ్య సింధూ నదీ జలాల ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడి దృష్ట్యా దీని అమలును న్యూదిల్లీ నిలిపివేసింది. ఇది పాక్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
క్షిపణి పరీక్షకు ఆదేశాలు…భారత్ అప్రమత్తం
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్ మరింత కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది.
తాజాగా క్షిపణి పరీక్షకు పాక్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 24-25 తేదీల్లో అనగా గురు, శుక్రవారాల్లో ఉపరితలం నుంచి ఉపరితలం వరకు కరాచీ తీరం వెంబడి క్షిపణి పరీక్ష నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో భారత్ దర్యాప్తు సంస్థలు అప్రమత్తం అయ్యాయి. ఈ పరిణామాలపై నిఘా పెట్టాయి. ఇక కేంద్ర హోంశాఖ కూడా అప్రమత్తం అయింది. ఉన్నతాధికారులతో హోంశాఖ చర్చలు జరుపుతోంది.