Wednesday, June 18, 2025
Homeమద్యం కేసులో మరో కీలక నేత చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్న సిట్‌

మద్యం కేసులో మరో కీలక నేత చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్న సిట్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఏపీ మద్యం కేసులో వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని సిట్‌ బృందం అదుపులోకి తీసుకుంది. మద్యం కేసులో ఆయనను నిందితుడిగా చేర్చిన సిట్‌ అధికారులు… ఇప్పటికే లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేశారు. మంగళవారం చెవిరెడ్డి బెంగళూరు నుంచి కొలంబో వెళ్లేందుకు సిద్ధం కాగా విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే ఏపీ పోలీసులకు కెంపెగౌడ (బెంగళూరు) విమానాశ్రయ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో తిరుపతి నుంచి ఏపీ సిట్‌ అధికారులు బెంగళూరు వెళ్లి… చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయానికి చెవిరెడ్డిని విజయవాడకు సిట్‌ అధికారులు తీసుకురానున్నారు. మద్యం కుంభకోణంలో ఆయనను సిట్‌ అధికారులు అరెస్టు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీ, తెలంగాణ సరిహద్దులో జగ్గయ్యపేట సమీపంలోని ఓ టోల్‌గేట్‌ వద్ద 8 కోట్ల 20 లక్షల రూపాయలు కారులో తీసుకువస్తూ చెవిరెడ్డి పీఏ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అప్పట్లోనే ఎన్నికల కమిషన్‌ కేసు నమోదు చేసింది. మద్యం ముడు పులను హైదరాబాద్‌ నుంచి ఆంధ్రాకు తరలిం చడంలో చెవిరెడ్డి మనుషులు కీలకపాత్ర పోషించారని సిట్‌కు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి గన్‌మె న్‌లను, వ్యక్తిగత సిబ్బంది దగ్గర ఇప్పటికే వాంగ్మూలాలు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా… చెవిరెడ్డి గన్‌మెన్‌ మదన్‌రెడ్డి మంగళవారం హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. తమతో బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారని, చెవిరెడ్డి పాత్ర ఉన్నట్లు చెప్పమన్నారని పోలీసులపైనే ఆయన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను సిట్‌ అధికారులు ఖండిరచారు. అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు చెవిరెడ్డి కొలంబో వెళ్లేందుకు ప్రయత్నించారని సిట్‌ అధికారులు భావిస్తున్నారు. చెవిరెడ్డిని బుధవారం సాయంత్రం విజయవాడ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కాగా… మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే రాజ్‌ కసిరెడ్డి, మాజీ సీఎం జగన్‌ సెక్రటరీగా ఉన్న ధనుంజయ్‌ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డి, భారతీ సిమెంట్స్‌ డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ గోవిందప్ప తదితరులను సిట్‌ బృందం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తొలిసారిగా మద్యం కేసులో రాజకీయ నాయకుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని సిట్‌ అదుపులోకి తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, సిట్‌ అధికారుల తీరును చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనయుడు, చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి చెవిరెడ్డి తప్పుబట్టారు. భాస్కరరెడ్డిని మద్యం కేసులో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. గన్‌మెన్‌ను బెదిరించి తప్పుడు వాంగ్మూలం నమోదు చేశారని ఆరోపించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు