Homeమలివిడత భూ సమీకరణ

మలివిడత భూ సమీకరణ

- Advertisement -

. అమరావతి కోసం మరో 44 వేల ఎకరాలు
. రాజధాని మౌలిక సౌకర్యాల కల్పనకు శ్రీకారం
. ప్రయోజనం కలిగేలా పోలవరం`బనకచర్ల
. వచ్చే ఏడాది పొగాకు క్రాప్‌ హాలిడే
. 20 టన్నుల పొగాకు సేకరణకు నిర్ణయం
. స్వర్ణాంధ్రపై పీ4 కమిటీలు
. రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయాలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అమరావతి రాజధానిలో మౌలిక సౌకర్యాల కల్పన కోసం మలివిడత భూ సమీకరణ చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒకే రకమైన రూల్స్‌తో ల్యాండ్‌ ఫూలింగ్‌ విధానంలో మరో 44వేల ఎకరాల సేకరణకు కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్ర పీ4పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో మొత్తం 42 అంశాలకు ఆమోదం తెలిపారు. అజెండా అంశాల అనంతరం రాజకీయ అంశాలపై చర్చించారు. రాజధాని అమరావతిలో చేపడుతున్న మలివిడత భూ సమీకరణపై మంత్రిమండలిలో చర్చించారు. తొలివిడత భూ సమీకరణకు వర్తించిన నిబంధనలే..మలివిడత భూ సమీకరణకు వర్తింప చేయాలని నిర్ణయించారు. అనంతరం మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడిరచారు. ప్రపంచ స్థాయి సంస్థలను, విద్యను, వైద్యాన్ని, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ల్యాండ్‌ పూలింగ్‌ చేయాలని భావించిందన్నారు. యూనిఫాం ఫ్రేమ్‌వర్కుతో ల్యాండ్‌ పూలింగ్‌ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఎన్‌జీటీ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వాటర్‌ బాడీస్‌ పరిరక్షించే విధంగా నిబంధనలను రూపొందించడం జరిగిందని, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ల్యాండ్‌ పూలింగ్‌ చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో పాటు రైతులకు మెరుగైన ప్యాకేజీ అందించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు.
అ రాష్ట్రంలోని అనేక సంస్థలకు భూములు కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్‌ క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏపీసీఆర్డీఏ)లోని 64 బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను సరెండర్‌ చేయడం ద్వారా బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్ల పోస్టులకు ప్రమోషనల్‌ చానెల్‌ కల్పిస్తూ అలాగే 40టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల మంజూరీకి/అప్‌గ్రేడేషన్‌కు పురపాలక, పట్టణాభివృద్ది శాఖ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మరో 9 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు, భవ నిర్మాణ చట్టంలో నిబంధనలు సవరిస్తూ, సులభంగా అనుమతులు వచ్చేలా కొన్ని సవరణలకు మంత్రిమండలి ఆమోదించింది. టెన్నిస్‌ క్రీడాకారుడు సాయికి స్పోర్ట్స్‌ కోటా కింద డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. తిరుపతి జిల్లా వడమాలపేటలో 12.07 ఎకరాలను పర్యాటకశాఖకు బదిలీకి అనుమతిచ్చింది. పర్యాటక ప్రాంతం గండికోట వద్ద రిసార్టు ఏర్పాటు కోసం రూ.50 ఎకరాలు కేటాయించింది.
అ ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా పొగాకు కొనుగోలు కోసం రూ.273.17 కోట్ల మంజూరుకు పరిపాలనపరమైన అనుమతులు ఇచ్చింది. రాష్ట్రంలో 20 మిలియన్‌ టన్నుల పొగాకును రాష్ట ప్రభుత్వం సేకరించాలని, వచ్చే ఏడాది పొగుకు సాగుకు క్రాఫ్‌ హాలిడే ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో ఈ3 రోడ్డును ఎన్‌హెచ్‌16కు అనుసంధానించేందుకు రూ.682 కోట్ల టెండర్ల ఆమోదానికి పరిపాలన అనుమతి లభించింది.
అ రాజధానిలో లా యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధిత భూమి లీజుకు ఇవ్వడానికి మంత్రిమండలి నిర్ణయించింది. విశాఖ మధురవాడలో 22.19 ఎకరాల్లో కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సంస్థను ఏర్పాటు చేస్తూ…రూ.1582 కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో 4687 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా ఉన్నతీకరించేందుకు ఆమోదముద్ర వేసింది. ఇటీవల జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో పెట్టుబడులపై తీసుకున్న నిర్ణయాలకు, రాజధాని అమరావతిలో అన్ని హంగులతో కన్వెన్షన్‌ సెంటరు నిర్మించాలని నిర్ణయించింది. విజయవాడ అంబేద్కర్‌ విగ్రహ ప్రాంగణాన్ని సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్టుమెంట్‌ నుంచి ఏపీ కల్చరల్‌ విభాగానికి బదిలీ చేయనుంది. రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగేలా పోలవరం`బనకచర్ల ప్రాజెక్టు చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం డ్యామ్‌, సర్‌ ఆర్డర్‌ కాటన్‌ బ్యారేజీ రక్షణ పనుల కోసం రూ.350 కోట్ల నిధుల విడుదలకు ఆమోదించింది. పర్యాటక ప్రాంతమైన గండికోట వద్ద రిసార్టు ఏర్పాటుకు 50 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు