Homeఆంధ్రప్రదేశ్మిషన్‌ మోడ్‌లో పనిచేయాలి

మిషన్‌ మోడ్‌లో పనిచేయాలి

- Advertisement -

అధికారులకు మంత్రుల కమిటీ దిశానిర్దేశం

విశాలాంధ్ర-సచివాలయం : అధికారులు మిషన్‌ మోడ్‌లో పనిచేయాలని, అప్పుడు అనుకున్న లక్ష్యాలు సాధించగలమని మంత్రుల కమిటీ సూచించింది. ఏడాది పరిపాలనలో కల్పించిన ఉద్యోగాలు తదితర అంశాలపై మంగళవారం అధికారులతో మంత్రులు సమావేశమయ్యారు. అవసరమైన దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సచివాలయంలోని మంత్రి నారా లోకేశ్‌ చాంబర్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంగళవారం జరిగిన సమావేశంలో మంత్రులు టీజీ భరత్‌, పొంగూరు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్‌, జనార్దన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించడం పెద్ద విజయమన్నారు. గత ఏడాది జూన్‌ నుంచి ఇప్పటివరకు రూ.9.5లక్షల కోట్ల పెట్టుబడులు, 8.5లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు, వివిధ రంగాల్లో 3,94,416 ఉద్యోగాలు కల్పించడం గురించి మాట్లాడారు. అత్యధికంగా ఎంఎస్‌ఎంఈ రంగంలో 1,18,268 యూనిట్ల ద్వారా 2,48,902 ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి ద్వారా 73 వేలు, పర్యాటక రంగంలో 49,765 చొప్పున ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో ఉద్యోగాలు ఐదు రెట్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు. వివిధ ప్రభుత్వశాఖలు, ప్రైవేటురంగంలో కల్పిస్తున్న ఉద్యోగాలను గ్రామ సచివాలయాల ద్వారా ట్రాక్‌ చేసి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని వారికి మంత్రులు సూచించారు.
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, సమిష్టికృషితో ఇది సాధ్యమన్నారు. రాజధాని నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని, అక్కడ అసంఘటిత రంగంలో ఇప్పటికే 10వేల మంది పనిచేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. అత్యధిక ఉద్యోగాలు లభించే మ్యానుఫ్యాక్చరింగ్‌, సర్వీసెస్‌ సెక్టార్లపై అధికారులు దృష్టిసారించాలని అన్నారు. సమావేశంలో సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు అజయ్‌ జైన్‌, ఎన్‌. యువరాజ్‌, కాంతిలాల్‌ దండే, ఏపీ ఈడీబీ సీఈవో సాయికాంత్‌ వర్మ,
ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్‌ కిశోర్‌, ట్రాన్స్‌కో జేఎండీ కీర్తి చేకూరి, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ ఎండీ కమలాకర్‌ బాబు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు