హైదరాబాద్: ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్, నిర్మాణ రంగాలలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ద్వైవార్షిక ప్రదర్శన ‘ఐఐఐడీ షోకేస్ ఇన్సైడర్ ఎక్స్ 2026’ను నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కేవలం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి మాత్రమే కాదని, అవకాశాలు, జీవనశైలి, ఆవిష్కరణలు కలిసే ఒక గ్లోబల్ గమ్యస్థానంగా ఎదుగుతుందన్నారు. ఐఐఐడీ షోకేస్ అనేది సరికొత్త ఇంటీరియర్ ఉత్పత్తులు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, గ్లోబల్ డిజైన్ ట్రెండ్లను ఒకే చోటకు తెచ్చే ఒక శక్తివంతమైన వేదికగా నిలుస్తుందన్నారు. ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదని, నిర్మాణ రంగ సౌందర్యాన్ని, పని తీరును, స్థిరత్వాన్ని పెంపొందించడానికి ఒక ఉత్రేÎరకం లాంటిదన్నారు.


