Homeఅంతర్జాతీయంమొంటానాలో గాంధీ విగ్రహావిష్కరణ

మొంటానాలో గాంధీ విగ్రహావిష్కరణ

- Advertisement -

సీటెల్: భారతదేశ జాతిపిత మహాత్మాగాంధీ తొలి విగ్రహాన్ని అమెరికా రాష్ట్రమైన మొంటానాలో ఆవిష్కరించారు. ఆయన అహింసా సిద్ధాంతం నేటి ప్రపంచ క్రమానికి అవసరమని అక్కడి అధికారులు తెలిపారు. మిస్సౌలాలో మొంటానా యూనివర్సిటీ పరిధిలోని ప్రఖ్యాత మైక్ మాన్స్‌ఫీల్డ్ సెంటర్ వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని సీటెల్‌లోని భారత్ కాన్సులేట్ జనరల్ ఒక ప్రకటన చేశారు. మొంటానా గవర్నర్ గ్రెగ్ జియాఫోర్టె, కాన్సుల్ జనరల్ ప్రకాశ్ గుప్తా కలిసి గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని మొంటానా రాష్ట్రానికి భారత్ కానుకగా ఇచ్చింది. మొంటానా, భారత్ బంధం మరింత బలపడాలని గవర్నర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. గాంధీ విగ్రహాన్ని కానుకగా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మొంటానా వర్సిటీ విద్యార్థులు, మొంటానా వరల్డ్ అఫైర్స్ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. విద్యార్థులు అనంతరం హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు