Friday, April 4, 2025
Homeరాజ్యాంగ వ్యతిరేక శక్తులకుబుద్ధి చెబుదాం

రాజ్యాంగ వ్యతిరేక శక్తులకుబుద్ధి చెబుదాం

. ఇంధనం లేని ‘డబుల్‌ ఇంజన్‌’ తో ప్రయోజనం శూన్యం
. సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర – లేపాక్షి: పజాస్వామ్మాన్ని కాపాడాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ… రాజకీయ ప్రయోజనాల కోసం కులమతాలను రెచ్చగొడుతున్నారని…దేశ సంపదను అదాని, అంబానీలకు దోచిపెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ దుయ్యబట్టారు. సోమవారం ఉదయం హిందూపురంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్లో పట్టణ సీపీఐ కార్యదర్శి కనిశెట్టిపల్లి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. రామకృష్ణ మాట్లాడుతూ… దేశంలో బీజేపీ అధికారం చేపట్టాక నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. దేశ వ్యాప్తంగా డబ్బున్న వ్యక్తులే అధికారం చెలాయిస్తున్నారని… వెనుకబడిన కులాల వారు పేదలుగానే మిగిలారన్నారు. కేంద్ర కేబినెట్లో ఒక్క మైనార్టి మంత్రి కూడా లేరన్నారు. కరువు కాటకాలతో విలవిల్లాడే జిల్లాలకు ప్రత్యేక విధి విధానాలు లేవన్నారు. ప్రతి ఒక్కరూ మోదీ సర్కారు రాజ్యాంగ వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీకి రూ. 3లక్షల కోట్లు ఇచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెబుతున్నారని… అదే జరిగితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం… ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో ఏ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇంధనంలేని డబల్‌ ఇంజన్‌ ప్రభుత్వం రోజురోజుకు మాయమాటాలు చెప్పడమే గాని చేసింది ఏమిలేదన్నారు. నిధులు తేలేక పోలవరం ఎత్తును తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నా యని… దీని వల్ల తాగు, సాగునీటి పరంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో పేదలకు గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చి… ఇళ్లు కట్టిస్తామన్న చంద్రబాబుకు ఆ విషయం గుర్తుందా అని ఎద్దేవా చేశారు. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలి సొంత లాభాలు చూసుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో తెల్లదొరలను ఎదిరించిన భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్లు పూర్తి చేసుకుందని…ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాసమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సదస్సులో సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్‌, రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాటమయ్య, జనసేవాదళ్‌ వలంటీర్‌ రాష్ట్ర నాయకులు మురళీ, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోష్‌, సీపీఐ తాలుకా నాయకులు శ్రీరాములు, పవిత్ర, మారుతీరెడ్డి, బాబు, శివప్ప ఇస్మాయిల్‌, రవికుమార్‌, సమీవుల్లా, చలపతి, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, ఉపాధ్యక్షుడు నరసింహమూర్తి, మహిళ సంఘం వర్కింగ్‌ నాయకురాలు షబీరా, సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు