ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ : ధర్మవరం నియోజకవర్గ లోని ముదిగుబ్బ మండలంలో గత కొన్ని నెలలుగా విద్యుత్ కోతలు అధికమై ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, అజిత్ అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదని, విద్యుత్ సరఫరాను ముదిగుబ్బలో నిరంతరం ఉండేలా చేసేంతవరకు మా పోరాటాలు ఆగవు అని ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆదివారం అర్ధరాత్రి సమయంలో రోడ్డున బైఠాయించి, ప్రజలతో నిరసన తెలియజేశారు. దీంతో ట్రాఫిక్కుకు తీవ్రంగా అంతరాయం కలిగింది. అనంతరం చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ ముదిగుబ్బలో అపక్రమిత విద్యుత్ కోత ఎందుకు వస్తుందో..? విద్యుత్ అధికారులు తెలపలేదని, ఇష్టానుసారం విద్యుత్ కోతలు విధించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అసలే వేసవికాలం, అందులో ఎండ వేడిమికి తట్టుకోలేక విద్యుత్ మీద ఆధారపడిన సాధారణ ప్రజల యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని విద్యుత్ అధికారులు, పట్టి పట్టినట్టు వ్యవహరించడం సమంజసం కాదని, ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ, విద్యుత్ కోత పరిష్కరించడంలో వారు పూర్తిగా విఫలం కావడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ముదిగుబ్బ పాత ఊరు గుడంపల్లి తండా ప్రజలు విద్యుత్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. తదుపరి విద్యుత్ శాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, జాతీయ రహదారిలో రాస్తారోకో నిర్వహించారు జరిగిందని తెలిపారు. తదుపరి హామి మేరకు రాస్తారోకో నిలిపివేయడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, పెద్ద ఎత్తున ముదిగుబ్బ మండల ప్రజలు పాల్గొన్నారు.
విద్యుత్ సరఫరా నిరంతరం అందించేంతవరకు పోరాటాలు ఆపము..
RELATED ARTICLES