Monday, June 9, 2025
Homeసాహిత్యంవీరబాహుడి పాట

వీరబాహుడి పాట

పల్లవి: తానే తందన.. తానే తందన
నందానందన.. నిజమనుకుందునా!
ఇది విశ్వమంతా వినిపించే
వీరబాహుడి డప్పు
ఇందులోనా తప్పులుంటే
ఇకనైనా నోరు విప్పు ‘‘తానే’’
చరణం: అడవుల్లో నీ కన్నులు
స్కానింగ్‌ జల్లెడులురా !
నీ కనుబొమలు ఎగిరెగిరే
ఏకే ఫార్టీ సెవెన్లురా !
నీ చూపులేమో డ్రోన్లురా !
నీ భాష బాంబు గోషరా !
నీకు ఎన్కౌంటర్‌ జాతర …
నీ మనసు మందు పాతర!
నీది బుల్లెట్‌ ప్రూఫ్‌ గుండెరా !
అది కార్పొరేట్ల బండి రా! ‘‘తానే’’
చరణం: ఏకపక్ష పంచనామా,
ఎకాఎకీన దహనాలు
స్మశానాల చుట్టూ
వన్‌పార్టీ ఫోరు సెక్షన్లు!
జడిసిపోయి రాబందుల జాడలు కనబడలేదురా!
నీ జపం చూసి కొంగ కూడా
బెంగ పెట్టుకుందిరా!
నలిపిన మందారాలు
అడివిలో విలపిస్తుంటే
అందాల పోటీల సందడిలో నువ్వురా! ‘‘తానే’’
శవము చూడనివ్వవు!
పాడె మొయ్యనివ్వవు!
చితాభస్మమివ్వవు!
కర్మ చెయ్యనివ్వవు!
ఆచారాలంటావు…
సంప్రదాయమంటావు
నీకు నువ్వే సనాతనం
నోరు మూసుకుంటావు!
ఫీనిక్స్‌ పక్షి లాగా
పుట్టుకొస్తారేమోనని
ఇంత భయం ఏలరా!
నీ కన్న నక్క నయంరా!! ‘‘తానే’’
నల్లి ధర్మారావు, 76609 67313

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు