విశాలాంధ్ర – సీతానగరం : శ్రీలక్ష్మినరసింహస్వామిఆలయంలో గురువారం జరిగిన ముడుపుల పూజలకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో ముడుపుల పూజలునిర్వహించారు.శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోవేకువజామునుండి రాత్రివరకు ముడుపుల పూజలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చినట్లు ఆలయ ప్రధానఅర్చకులు పీసపాటిశ్రీనివాసాచార్యులు,పీసపాటి రామానుజాచార్యులు తెలిపారు. బ్యాచులవారీగా ఈపూజలను నిర్వహించడంతోపాటు భక్తులుతెచ్చిన వివిధరకాల పూలదండలు,పూలు స్వామివారిని పెద్దఎత్తున అలంకరించారు.ప్రతీగురువారం శ్రీలక్ష్మి నరసింహస్వామీ దేవాలయంలోజరుగుతున్న ముడుపుల పూజలకు పాతభక్తులతోపాటు గురువారం నాడు 400మందికి పైగా కొత్త భక్తులు రాకతో ఆలయం కిటకిటలాడింది.నిర్మలమైన మనస్సుతో భక్తులు 27సార్లు ఆలయంచుట్టూ ముడుపులు పట్టుకొని ఓంశ్రీలక్ష్మి నరసింహస్వామి అంటూ ప్రదక్షిణలను చేస్తూ స్వామివారికి పూజలు చేస్తున్నారు.తీర్థప్రసాదాలు స్వీకరించి తరలి వెళ్తున్నారు.గురువారం జరిగిన ముడుపుల పూజలకు జిల్లా కలెక్టర్ సతీమణి, పలువురు జిల్లా, మండల అధికారులు,ఆలయధర్మకర్త చెలికాని వెంకటగోపాలకృష్ణ భారతిదంపతులు, భక్తులు పాల్గొన్నారు. భక్తులకు మంచినీటి సౌకర్యంతో పాటు వేసవిదృష్ట్యా మజ్జిగను ఏర్పాటుచేసినట్లు అర్చకులు శ్రీనివాసాచార్యులు రామానుజాచార్యులు తెలిపారు.ఆలయ ప్రధానఅర్చకులతో పాటు పవన్ ఆచార్యులు, మురారి, మనోజ్ ఆచార్యులు ,కృష్ణమోహన్ ఆచార్యులు, టీటీడీ దివ్య ప్రచారకులు కె. శ్రీనివాసరావులు దగ్గరుండి పూజలు చేయించడంతోపాటు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల పెద్ద ఎత్తున దుకాణ సముదాయంకూడా ఏర్పాటు చేయడంతో భక్తులు పూజలు అనంతరం వారికి కావలసిన కూరగాయలు, సామాగ్రిని తీసుకుని వెళుతున్నారు. కోరినకోర్కెలు తీరుస్తున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజలకు గురువారం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నట్లు పలువురు భక్తులు తెలియజేయడం గమనార్హం. చాలామంది భక్తులు నిరంతరం ముడుపులు కడుతూ స్వామివారిని పూజిస్తున్నట్లు తెలిపారు.