Wednesday, April 23, 2025
Homeజిల్లాలుఅనంతపురంసత్తా చాటిన మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు

సత్తా చాటిన మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు

హెడ్మాస్టర్ మేరీ వర కుమారి

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో తమ సత్తాను చాటడం జరిగిందని హెడ్మాస్టర్ మేరీ వర కుమారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పాఠశాలలో 80 మంది పరీక్షలు రాయగా 58 మంది ఉత్తీర్ణులు కావడం జరిగిందన్నారు. ఇందులో పి.సహస్ర 576 మార్కులు, ఎన్. భవిత 574 మార్కులు, బి. సిరి చందన 569 మార్కులు రావడం జరిగిందన్నారు. అంతేకాకుండా 500 మార్కులకు పైగా 14 మంది విద్యార్థులు తేవడం జరిగిందని తెలిపారు. దీంతో మా పాఠశాల 73 శాతము సాధించడం జరిగిందన్నారు. తదుపరి ఉత్తీర్ణత చెందిన, ప్రతిభ కనపరిచిన విద్యార్థినీలకు హెడ్మాస్టర్ తో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ అందరూ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు