Monday, February 3, 2025
Homeఅంతర్జాతీయంసిరియాలో కారుబాంబు పేలుడు…15 మంది మృతి

సిరియాలో కారుబాంబు పేలుడు…15 మంది మృతి

డమాస్కస్‌: సిరియాలో కారుబాంబు పేలడంతో 15 మంది మరణించారు. ఉత్తర సిరియా నగర శివార్లలో సోమవారం ఈ ఘటన జరిగింది. మన్‌బిజ్‌ నగర శివార్లలో వ్యవసాయ కార్మికులు ప్రయాణిస్తున్న వాహనం పక్కనే కారు బాంబు పేలిందని పౌర రక్షణ సంస్థ తెలిపింది. ఈ ఘటనలో 15 మంది మరణించగా, వారిలో 14 మంది మహిళలు ఉన్నట్లు వెల్లడిరచింది. మరో 15 మంది మహిళలకు గాయాలయ్యాయని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. ఈ ఘటనలో 18 మంది మరణించినట్లు బ్రిటన్‌కు చెందిన వార్‌ మానిటర్‌ ది సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది. నెలరోజుల వ్యవధిలో మన్‌బిజ్‌లో ఇది ఏడవ కారు బాంబు పేలుడు ఘటన అని పౌర రక్షణ సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ మునీర్‌ ముస్తఫా తెలిపారు. యుద్ధ వాతావరణం నుండి బయటపడుతున్న సమయంలో సిరియా పౌర ప్రాంతాలపై, పౌరులు లక్ష్యంగా జరుగుతున్న ఈ దాడులు ప్రజలను భయానికి గురిచేస్తున్నాయని అన్నారు. ఈ దాడులు సిరియాలో మానవతా పరిస్థితిని మరింత దిగజార్చాయని చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు