సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
న్యూదిల్లీ:
సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సి.రాజేశ్వరరావు (సీఆర్) స్ఫూర్తి ప్రదా తని పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా కొనియాడారు. సీఆర్ 31వ వర్థంతిని పురస్కరించుకొని న్యూదిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయం అజయ్ భవన్‌లో ఆయన విగ్రహం, చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయ ణ, పల్లబ్ సేన్ గుప్తా, డాక్టర్ బలచంద్ర కాంగో, సయ్యద్ అజీజ్ పాషా, రామకృష్ణ పాండా, అనీరాజా, గిరీశ్ చంద్ర శర్మ కూడా పుష్పాంజలి ఘటించారు. సీఆర్ సేవలు చిరస్మరణీ యమని, ఆయన జీవితం ఆదర్శనీయ మని నాయకులు కొనియాడారు. సీఆర్ తుది వరకు పార్టీ కోసం పనిచేశార న్నారు. ఆయన తన జీవితాన్ని బడుగు, బలహీనుల పక్షాన పోరాటాలకు అంకితమిచ్చారని శ్లాఘించారు. ఆయన సుదీర్ఘకాలం సీపీఐ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, సీఆర్ అభిమానులు పాల్గొన్నారు.