షనిల్ యాకుబ్
జనాభాపై ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు తారుమారవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హతలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల తీసుకున్న చర్యలు ఇందుకు అద్దంపడుతున్నాయి. జనాభాను నియంత్రించడానికిగాను 1994లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ చట్టాలను సవరించింది. ఆనాడు ఇద్దరు పిల్లులున్న అభ్యర్థులు మాత్రమే పోటీ చేయాలనీ, అంతకు మించి పిల్లలున్న వారు పోటీచేయకూడదన్న నిబంధన పెడుతూ చట్టాలను సవరించారు. జనాభా పెరుగుదలలో స్తంభన నేపథ్యంలో తాజాగా ఈ నిబంధనను మార్చనున్నట్లు ప్రతిపాదించారు. ఇద్దరుపిల్లల కంటే తక్కువ మంది ఉన్నట్లయితే పోటీ చేయడానికి అనర్హులవుతారని, చట్టం చేయాలని 2025 జనవరి 16న ప్రతిపాదన చేశారు. జనాభాను అనుసరించి కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. అందువల్ల జనాభా పెంపుదలకు చంద్రబాబు ఇంతకు ముందు తాను తీసుకున్న నిర్ణయాలను తానే మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలకంటే తక్కువమంది ఉంటే పోటీకి అర్హులుకాదు. ఇద్దరికి లేదా అంతకు ఎక్కువ మంది పిల్లలుంటేనే పోటీ చేయడానికి అర్హత ఉండేట్టు చట్టాన్ని సవరించే తలంపు చంద్రబాబు నాయుడు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్(సవరణ) బిల్లు 2024ను, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల (సవరణ) బిల్లు, 2024ను ప్రభుత్వం ఆమోదించింది. ఆకస్మికంగా ఈ బిల్లు ప్రతిపాదించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో ఎక్కువ మంది పిల్లలుంటే అనర్హతను ప్రకటించి, తాజాగా తక్కువమంది పిల్లలుంటే అనర్హత ప్రకటించారు. దేశంలో సంప్రదాయంగా అనేక రాష్ట్రాలలో ఇద్దరుపిల్లల పరిమితిని అమలు చేస్తున్నారు. ఆయా కుటుంబాలలో అత్యధిక మంది పిల్లలు లేకుండా నియంత్రించడం కోసం ఇద్దరు పిల్లల పరిమితిని విధించారు. అయితే చంద్రబాబునాయుడు పెట్టిన కనీస పరిమితి తిరోగమనచర్య అవుతుంది. అదే సమయంలో రాజ్యాంగపరంగా సంశయాత్మకమైనది. ఇది ఆచరణాత్మకమైనది కాదు. తీవ్రమైన రిస్క్‌లు ఇందులో ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతంగా పాల్గొనడం విరుద్ధమవుతుంది. వ్యక్తిగత స్వేచ్ఛ అలాగే స్త్రీ పురుష సమానత్వం ఉండదు.
ప్రపంచవ్యాప్తంగా సంతాన సాఫల్యత రేటు బాగా తగ్గిపోయి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆసియా, ఐరోపా, ఉత్తరఅమెరికా దేశాలలో నిర్దిష్టమైన జనాభా ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు చేసిన ప్రతిపాదన సంతానసాఫల్యతకు సంబంధించిన సూచన ఆందోళన కలిగిస్తోంది. హర్యానాలో 2023లో సుప్రీంకోర్టు ఆ రాష్ట్రం ఏర్పరచిన గరిష్టంగా ఇద్దరు పిల్లల నిబంధనను సమర్థించింది. ఎన్నికల్లో పోటీచేసే హక్కు ప్రాథమిక హక్కు ఏమీకాదు. అయితే అది చట్టబద్ధమైనదే. కోర్టు చెప్పిన సహేతుకమైన విషయం జనాభా నియంత్రణలోనే ఇమిడి ఉంది. ఇది జాతీయ జనాభా విధానం (2000 సంవత్సరం)పై ఆధారపడి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీస అర్హతను ఇద్దరు పిల్లలు ప్రతిపాదన చేయడం ఇతర అన్ని రాష్ట్రాలకంటే భిన్నంగాఉంది. 2009 సంవత్సరంలో చంఢీగడ్ పాలనా విభాగం సుచిత, శ్రీ వత్సవ మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు పునరుత్పత్తి అవకాశాలు వ్యక్తి గత స్వేచ్ఛలో భాగమవుతాయి. రాజకీయ వ్యవహారాలలో పాల్గొనడానికి శిశు జననం తప్పనిసరిచేయడం ప్రాథమిక హక్కులో జోక్యం చేసుకోవడం అవసరం. ఈ నేపథó్యంలో చంద్రబాబు ప్రాతినిధ్యం ఆర్టికల్ 22 కింద క్లిష్టమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆర్టికల్ 14 కింద ఈ ప్రతిపాదన సహేతుక వర్గీకరణను అనుమతించడం వీలుకాదు.
అన్వర్‌అలీ సర్కార్ (1952), ఈ పీ రోయప్ప (1974) కేసులలో సుప్రీంకోర్టు నిర్ణయాల ప్రకారం, పరీక్షను ఎదుర్కొవలసి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఎన్నికల్లో పోటీచేయడానికి పిల్లలను పరిమితం చేసే విధానం సరైంది కాదు. ఇద్దరు పిల్లలను కన్నవారిని పోటీ చేయకుండా పరిమితం చేయడం సహేతుకతలేనిదే. యువతీ యువకులకు, పిల్లలులేని దంపతులను పోటీచేయకుండా నిలువరించడం సరైందికాదు. 2003లో ముగ్గురితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆర్టికల్ 19(1)(ఏ)ప్రకారం ఓటు హక్కుగా గుర్తించింది. అలాగే 2006లో కుల్‌దీప్ నయ్యర్ నాయకత్వంలోని ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం రాజ్యాంగం మౌలిక నిర్మాణంలో స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు జరగడం ఒక భాగమని చెప్పారు. ఈ విధంగా చూసినప్పుడు చంద్రబాబునాయుడు ప్రతిపాదన స్వేచ్ఛాప్రసంగానికి, మౌలిక నిర్మాణానికి అవమానమేకాదు, ఇండియా ప్రజాస్వామ్య వ్యవస్థను మౌలికంగా ప్రమాదం కలిగిస్తుంది.
ప్రస్తుతం రాజ్యాంగంలోని ఆర్డికల్స్ 243 ఎఫ్, 243 వి కింద 21 సంవత్సరాల వయసుగల యువతీ యువకులు పంచాయతీలు, లేదా మున్సిపాలిటీల పరిపాలనను నిర్వహించగల హక్కు ఉంది. ఇండియాలో వివాహంచేసుకునే యువకుల వయసు 21, యవతుల వయసు 18 ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదించిన ఇద్దరు పిల్లల కనీస విధానం రాజకీయాలలో పాల్గొనే వయసు 24 లేదా 25ఏళ్లు ఉండాలనే కనీస వయసుకు విరుద్ధంగా ఉంటుంది. చంద్రబాబు ప్రతిపాదన విశిష్టంగా లేదు. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు విధానకర్తలకు ఆందోళన కలిగిస్తుంది. చంద్రబాబు ప్రతిపాదనకు చట్టబద్ధమైన భద్రత అవసం. ఇందుకోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. హక్కుల ఆధారిత ప్రజాస్వామ్యంలో బలవంతపు ప్రజావిధానాలు, ఆంక్షలు విధించడానికి ఎంతమాత్రం స్థానంలేదు.
చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపైన రాష్ట్రంలో ప్రతిపక్షాలతో విపులంగా చర్చించాలి. అనేక రాష్ట్రాల్లో లేని ఈ విధానం ఎందుకు అమలు జరుపుతున్నారన్న విషయమై కేంద్ర ప్రభుత్వం లోతుగా చర్చించి ఆమోదించాలి. ప్రతిపక్షాలు సైతం విడిగా చర్చించి అయినా తమ అభిప్రాయాలను వెల్లడిరచాలి.