గృహ సంక్షోభంపై ప్రజాగ్రహం ` 50 నగరాల్లో భారీ ప్రదర్శనలు
మాడ్రిడ్: స్పెయిన్‌లో నిరసనలు హోరెత్తాయి. గృహ సంక్షోభాన్ని తక్షణమే పరిష్కరించాలన్న డిమాండ్ మార్మోగింది. రాజధాని మాడ్రిడ్ సహా దేశవ్యాప్తంగా 50 నగరాల్లో ప్రదర్శనలు శాంతియుతంగా జరిగాయి. వేలాది మంది వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించారు. గృహ చట్టాన్ని అత్యవసరంగా ఆమోదించడంలో ప్రభుత్వం విఫలం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అద్దెదారులకు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ప్లకార్డులు , బ్యానర్లు, జెండాలు పట్టుకొని కదం తొక్కారు. 87 ఏళ్ల వృద్ధురాలిని ఇంటి నుంచి ఖాళీ చేయించిన ఘటనతో పాటు పెరుగుతున్న అద్దెలు, గృహాలు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారడంపై ప్రజలు మండిపడ్డారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ప్రతిపాదనలు పార్లమెంట్‌లో ఆమోదలేకపోవడాన్ని ఆక్షేపించారు. 70 వేల నుంచి ఐదు లక్షల మంది వరకు నిరసనల్లో పాల్గొన్నట్లు నిర్వాహకులు అంచనా వేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన రాజకీయ పార్టీలకు ప్రజలే అనుకూలంగా మారాల్సిన దుస్థితి ఏర్పడటం సిగ్గుచేటు అంటూ నిరసనకారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వాలెన్సియాలో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. గతంలో స్నేహితులతో కలిసి డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌కు నెలకు 900 యూరోలు అద్దె చెల్లించే వాళ్లమని, ఇప్పుడు వెయ్యి యూరోలు చెల్లించాల్సి వస్తున్నదని ఓ నిరసనకారుడు తెలిపారు. ఇప్పుడు నిజమైన రాజకీయం మొదýయ్యింది. అదే ప్రజా రాజకీయం అంటూ కొందరు వ్యాఖ్యానించారు. ప్రజలకు అనుగుణంగా పాలన సాగించాల్సిన పరిస్థితులను, పౌరులకు కల్పించిన హక్కులను పరిక్షించడానికి కట్టుబడటం అధికారంలో ఉన్న వారి బాధ్యతన్నారు.
ఈ నిరసనల నిర్వాహÅ£ సంస్థ ‘అద్దెదారుల సంఘం’ ప్రతినిధి వాలెరియా రాకు మాట్లాడుతూ, ప్రజల ఆందోళన లతో వీధుల్లో కొత్త శక్తి కనిపిస్తోంద న్నారు. గృహ సమస్యపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఈ పరిణామాల క్రమంలో దేశంలో ముందస్తుగానే ఎన్నికలు రావచ్చని, ఆ దిశగా ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ నవంబరులో ఆలోచన చేస్తున్నారని స్థానిక మీడియా వెల్లడించింది.


