హైదరాబాద్: ప్రీమియం హోమ్ లిఫ్ట్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఎలైట్ ఎలివేటర్స్, తమ అత్యాధునిక ఎలైట్ ఎక్స్ 300 ఎక్స్ 300 ప్లస్ హోమ్ లిఫ్ట్‌లు విడుదల చేసింది. దాని ఉత్పత్తి. పోర్ట్ ఫోలియోకు ఈ వినూత్న జోడిరపులు ఆధునిక గృహ చలనశీలతలో కొత్త యుగాన్ని సూచిస్తాయని, లగ్జరీ, అధునాతన సాంకేతికత పర్యావరణ పరిరక్షణను మిళితం చేస్తాయని ఎలైట్ ఎలివేటర్స్ ఎండి విమల్ బాబు చెప్పారు. 2025 నాటికి యుఎస్‌ఏ, కెనడా వంటి కొత్త భౌగోళిక ప్రాంతాలలో తమ మార్కెట్ ఉనికిని కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలతో, కంపెనీ హోమ్ లిఫ్ట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది అన్నారు. కంపెనీ వృద్ధి పథం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, భారతీయ గృహ ఎలివేటర్ మార్కెట్ 2030 నాటికి 8-9 శాతం సీఏజీఆర్ వద్ద వృద్ధి చెందుతుందని, ఈ విస్తరణను సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.