Monday, January 13, 2025
Homeజిల్లాలువిజయనగరంవాలంటీర్లుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుని న్యాయం చేయండి

వాలంటీర్లుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుని న్యాయం చేయండి

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక కూటమి నాయకులకి వాలంటీర్లు వినతులు
విశాలాంధ్ర విజయనగరం టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తె వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని ఎవ్వరిమీద రాజకీయ కక్షలు చూపబోమని వాగ్దానం చేసిన విషయం మరచిపోకుండా వాలంటీర్లుకి న్యాయం చేయాలని అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ గుర్తు చేశారు.
శనివారం ఉదయం విజయనగరంలో ఎ.పి గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ అనుబంధం ) అధర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ నేతృత్వంలో స్థానిక కూటమి నాయకులు వినతులు ఇవ్వాలని ఇచ్చిన పిలుపులో భాగంగా 49 వ డివిజన్ కార్పొరేటర్ కర్రోతు రాధామని, 50 వ డివిజన్ టిడిపి నాయకులుకి వినతిపత్రాలు సమర్పించడం జరిగింది. ఆమె స్పందించి ఈ వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి వాలంటీర్లుకి న్యాయం జరిగే విధంగా చూస్తామని తెలిపారు.ఈ సందర్భంగా బుగత అశోక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా 2019 నుండి వాలంటీర్లుగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వాలంటీర్లుగా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను ప్రజల వద్దకు చేరవేయడంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిగా ఎంతో కష్టపడి పనులు చేసారని అన్నారు. కరోనా విళయతాండవం చేస్తున్న సమయంలో ప్రభుత్వం ఆదేశాలు మేరకు ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజలకు ఎనలేని సేవలు అందించారన్నారు. 2024 ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారములోనికి వస్తే మా వాలంటీర్స్ అందరికి న్యాయం చేస్తామని, నెలకు 10 వేల రూపాయలు గౌరవ వేతనం పెంచి ఇస్తామని, వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారనీ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత కూడా వాలంటీరు వ్యవస్థను కొనసాగిస్తామని ఇచ్చిన హామీలకు మేమంతా కట్టుబడి వున్నామని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయులు మీడియా ద్వారా ప్రకటించారనీ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఎన్నికల సమయంలో గత ప్రభుత్వ రాజకీయ నాయకులు ఒత్తిడి చేసినా మేము రాజీనామాలు చేయలేదన్నారు. వీళ్ళు ఎవ్వరి రికమండిషన్లుతో ఉద్యోగాల్లో చేరలేదని విద్యార్హతలు బట్టి ఇంటర్వ్యూల్లో సెలక్ట్ అయ్యి ఉద్యోగాలు సాధించుకున్నామని తెలిపారు. దయచేసి వాలంటీర్లు పై రాజకీయాలు పులమొద్దు అని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వము అధికారం చేపట్టి 7 నెలలు పూర్తి కావస్తున్నది కానీ ఇంత వరకు వాలంటీర్లుకి ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. 2024 జూన్ నెల నుండి మాకు గౌరవ వేతనం కూడా చెల్లించలేదన్నారు. రాష్ట్ర వ్యాపితముగా వివిధ ఉన్నత చదువులు చదువుకొని ప్రభుత్వానికి ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశ్యంతో వాలంటీర్ ఉద్యోగాల్లో చేరిన అందరి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తారని ఇచ్చిన మాట నిలబెట్టుకొని న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము అని తెలిపారు. వాలంటీర్లు సమస్యలను ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్ళి న్యాయం చేయమని కోరారు.ఈ కార్యక్రమంలో విజయనగరం 49, 50 డివిజన్ పరిధిలోని వాలంటీర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు