Tuesday, February 11, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఏపీయూడబ్ల్యూజే విస్తృతస్థాయి సదస్సుకు నా సహకారం పూర్తిగా ఉంటుంది..

ఏపీయూడబ్ల్యూజే విస్తృతస్థాయి సదస్సుకు నా సహకారం పూర్తిగా ఉంటుంది..

మంత్రి సత్యకుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరంలో త్వరలో జరిగే ఏపీయూడబ్ల్యూజే విస్తృతస్థాయి సదస్సుకు నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. ఆదివారం ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు చింతకాయల పుల్లయ్య, డి. బాబు ఆధ్వర్యంలో ధర్మవరం ఏపీడబ్ల్యూజే రెవెన్యూ డివిజన్ పాత్రికేయులు భారీ ఎత్తున మంత్రి సత్య కుమార్ ను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వయంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరంలో జరిగే ఏపీయూడబ్ల్యూజే విస్తృతస్థాయి సదస్సుపై చర్చించారు. భారీ ఎత్తున తనతోపాటు రాష్ట్ర మంత్రులను ఈ సదస్సుకు రప్పించి వీటి విజయవంతానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి పాత్రికేయులకు హామీ ఇచ్చారు. పాత్రికేయ సమస్యలపై ఆయా మంత్రుల నుంచి స్పష్టమైన హామీలు లభించేలా తమ వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో ఎప్పుడు సదస్సు ఏర్పాటు చేసేది తానే తెలియజేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే అతిపెద్ద యూనియన్ గా అవతరించిందంటే పాత్రికేయుల సమస్యల కోసం పోరాటాలు నిరంతరం చేయడం వల్లనే అది సాధ్యమైందన్నారు. అతిపెద్ద యూనియన్ కు తమ వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. తమ యూనియన్ సదస్సుకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న మంత్రి కార్యాలయ ఇన్చార్జ్ హరీష్ బాబుకు పాత్రికేయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జానపాటి మోహన్, జాంపుల అజయ్ చౌదరి, సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు