అధ్యక్షులు జయసింహ, కోశాధికారి సుదర్శన గుప్తా
విశాలాంధ్ర ధర్మవరం : పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యము అని అధ్యక్షలు జయ సింహా, కోశాధికారి సుదర్శన్ గుప్తా క్యాంపు చైర్మన్ పెరుమాళ్లదాస్ తెలిపారు.తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని కోట మున్సిపల్ పాఠశాలలో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి-బెంగళూరు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ అనంతపురం జిల్లా వారి సహకారంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు దాసరి కేశమ్మ, కీర్తిశేషులు దాసరి పెద్ద వెంకటేశులు జ్ఞాపకార్థం కోడలు దాసరి రమాదేవి, కుమారుడు డివి.వెంకటేశులు (చిట్టి) అండ్ సన్స్ వారు వ్యవహరించడం జరిగిందని తెలిపారు. ఈ ఉచిత శిబిరంలో 134 మంది రోగులకు కంటి వైద్య పరీక్షలను నిర్వహించగా అందులో 82 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. వీరికి ఉచిత వసతి, ఉచిత రవాణా సౌకర్యం, ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామని తెలిపారు. బెంగుళూరు శంకరా కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అపేక్ష రోగులకు కంటి వైద్య పరీక్షలను నిర్వహించి, కంటిపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వారు వివరించడం జరిగిందని తెలిపారు. అనంతరం డాక్టర్ అపేక్ష మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ కంటిని కనీసం సంవత్సరానికి ఒకసారి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. నేడు చిన్న పిల్లలతో మొదలుకొని పెద్దలు వరకు కంటి పట్ల వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపారు. కన్ను కనపడకపోవడం అనేది ఒక అద్దాలతో మాత్రమే సరికాదని, కంటిలో నరం సమస్య కానీ పొర సమస్య కాని ఉండవచ్చునని తెలిపారు. తదుపరి ముఖ్యంగా షుగరు, బిపి ఉన్నవారు కచ్చితంగా ప్రతి సంవత్సరం ఒకసారి అయినా రెటీనా పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. చిన్నపిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్లు, టీవీలు చూడరాదని, అలా చూస్తే కంటికి గ్లాస్ పవర్ అనేటువంటిది రావడం జరుగుతుందని తెలిపారు. డాక్టర్ని సంప్రదించకుండా మెడికల్ స్టోర్ లో ఎటువంటి కంటి డ్రాప్స్ తీసుకోకూడదని తెలిపారు. అలా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా సోకుతుందని తెలిపారు. అనంతరం రోటరీ క్లబ్ కమిటీ వారు హాస్పిటల్ డాక్టర్ను, క్యాంపు దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, సత్రశాల ప్రసన్నకుమార్, సోలిగాళ్ళ వెంకటేశులు, రమేష్ బాబు, రామకృష్ణ, శివయ్య, కొండయ్య, శ్రీనివాస్ రెడ్డి, గట్టు హరినాథ్, ఇన్నర్ వీల్ క్లబ్బు రాజేశ్వరి, అంబిక, వాలంటీర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యం
RELATED ARTICLES