Sunday, November 16, 2025
Homeఅంతర్జాతీయంఅఫ్గాన్‌లో భారీ భూకంపం

అఫ్గాన్‌లో భారీ భూకంపం

- Advertisement -

15మంది మృతి
200 మందికి పైగా గాయాలు

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దీంతో 15 మంది చనిపోగా, 200మంది వరకు గాయపడ్డారు. భూకంప కేంద్రం ఖుల్మ్‌ నగరానికి పశ్చిమ-దక్షిణ దిశలో 22 కిలోమీటర్ల దూరంలో సుమారు 28 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడిరచింది. ఉత్తర అఫ్గాన్‌ నగరం మజార్‌-ఎ షరీఫ్‌ సమీపంలో రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.3గా నమోదైంది. ఖుల్మ్‌ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనేకమంది శిథిలాల్లో చిక్కుకున్నారని… సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడిరచారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడిరచిన సమాచారం మేరకు ఘోర విపత్తు కారణంగా మజార్‌-ఎ షరీఫ్‌ సహా ఇతర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భూకంపం కారణంగా అనేకగ్రామాల్లోని ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఈ విపత్తు ధాటికి అనేక కుటుంబాలు కకావికలమైనట్లు పేర్కొన్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు